Advertisement
Google Ads BL

తమన్నా గుండెని ముక్కలు చేసింది ఎవరో?


తమన్నా అంటే మిల్కి బ్యూటీ, గ్లామర్ క్వీన్, పెద్దగా రూమర్స్ లేని తమన్నా.. ఈమధ్యనే బరువు విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నది. కరోనా టైం లో తమన్నా వెయిట్ పెగడంతో.. ప్రస్తుతం కాస్త లావుగా కనబడుతుంది. తాజాగా సమంత తో సామ్ జామ్ షోలో చాలా విషయాలను పంచుకుంది. విజయ్ దేవరకొండ హీరో అయితే రూల్స్ మొత్తం పక్కనపడేసి ముద్దు సీన్స్ కి సై అంతానంటూ సంచలనంగా మాట్లాడిన తమన్నాని సమంత ఓ ప్రశ్న అడిగింది. తమన్నా మీ ఇన్స్టా లో మీరు కాఫీ ని ఇష్టపడతారు. అలాగే కవి, నటి అని ఉంది. మీరు కవితలు కూడా రాస్తారా. నాకసలు ఇప్పటివరకు తెలియదే అని అడిగిన సమంత కి  తమన్నా షాకింగ్ సమాధానమే ఇచ్చింది.  

Advertisement
CJ Advs

ఎప్పుడైతే మన హృదయం బద్దలవుతుందో అప్పుడు మనం కవితలు కూడా రాస్తాం. ఈ విషయం నీకు కూడా తెలుసు అంటూ.. సమంత గతాన్ని కెలికేసింది. మన హృదయం ముక్కలయినప్పుడే మనం కవితలు రాస్తూ కవిగా మారతాం. ఈ సమాజంలో చాలామంది ఎదుటి వారి హృదయాలను ముక్కలు చేసే మనుషులు ఉంటారు అని తమన్నా అనగానే.. తమన్నా గుండె బద్దలు కొట్టిన ఆ మనిషి ఎవరు? వెంటనే కనిపెట్టాలంటూ కామెడీ చేసింది సమంత. మరి ఇప్పుడు తమన్నా హృదయం బద్దలయ్యేలా చేసిన ఆ అబ్బాయి ఎవరో తెలిసే వరకు నెటిజెన్స్ నిద్రపోయేలా లేరు.

Who broke Tamanna's heart?:

Tamanna reveals her secrets in Sam Jam show
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs