Advertisement
Google Ads BL

ఒక్కసారిగా డౌన్ అయిన కంటెస్టెంట్!


బిగ్ బాస్ చివరి వారంలోకి అడుగుపెట్టబోతుంది. నాగార్జున సీజన్ 4 గ్రాండ్ ఫినాలే ని ఓ రేంజ్ లో ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నాడు. ఇక వచ్చే వారం జరగబోయే గ్రాండ్ ఫినాలేకి సూపర్ స్టార్ మహేష్ రాబోతున్నాడనే టాక్ ఉండనే ఉంది. అయితే ఇప్పుడు ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి చివరి ఎలిమినేషన్ పై అందరిలో ఉత్కంఠ నెలకొంది. గత నాలుగు వారాలుగా ఎలిమినేట్ అవుతుంది అనుకున్న మోనాల్ అనూహ్యంగా గ్రాఫ్ పెంచుకుని హౌస్ లోనే కొనసాగుతుంది. బిగ్ బాస్ ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చని మోనాల్ ఎలా సేవ్ అవుతుంది అంటే.. గుజరాత్ నుండి మోనాల్ కి ఓట్స్ పడుతున్నాయంటున్నారు.

Advertisement
CJ Advs

మరోపక్క గత వారం అవినాష్ ఎలిమినేట్ అయ్యాక అరియనా తన గేమ్ ని మార్చేసింది అని.. ఎలాంటి క్రేజ్ లేని తాను మోనాల్ ముందు తేలిపోతా అనే భయంతో సింపతీ వర్కౌట్ అయ్యేలా ఏడుపులు, పెడబొబ్బలు, సోహైల్ తో గొడవ, మోనాల్ విషయంలో అరియనా చేసిన పనికి బయట ప్రేక్షకులు అరియనా కి వ్యతిరేఖంగా మారారని, ఇప్పటివరకు జెన్యూన్ గా ఆడిన అరియనా ఆట ఇప్పుడు కొత్తగా అంటే సింపతిగా కనిపిస్తుందని అంటున్నారు. ఎప్పుడూ స్టేబుల్ గా ఉన్న అరియనా గ్రాఫ్ చివరి వారంలో పడిపోయింది అని.. అరియనా అనుకున్నది కరెక్ట్ అని, మోనాల్ ముందు అరియనా ఈ చివరి వారంలో తేలిపోయింది అని అంటున్నారు.

అంతేకాదు ఈ వారం అరియనకి గడవడం కష్టమే అంటున్నారు. అభిజిత్ ఎప్పటిలాగే సేవ్ అవడం గ్యారెంటీ అని, సోహైల్ టాప్ 2 వెళ్లడం పక్కా అని, అఖిల్ ఎలాగూ టికెట్ టు ఫినాలే తో సేఫ్ జోన్ లో ఉన్నాడు. ఇక మిగిలిన హరిగా గత కొన్ని వారాలుగా బెటర్ ఫీలింగ్ తెప్పిస్తుంది కాబట్టి ఆమె ఈ వర్మ పక్క సేవ్ అయ్యి టాప్ 5 వెళుతుంది అని, ఇక మోనాల్ ని గుజరాత్ ప్రేక్షకులు కాపాడితే చివరికి అరియనా ఈ వారం ఎలిమినేట్ అవడం గ్యారెంటీ అంటూ సోషల్ మీడియా కోడై కూస్తుంది.

Contestant who is down at once!:

Bigg boss 4: Ariyana's game depleting in last weeks
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs