Advertisement
Google Ads BL

బుల్లితెర మీద మరోసారి ఎన్టీఆర్ సందడి!


స్టార్ హీరో ఎన్టీఆర్ స్టార్ మా లో బిగ్ బాస్ సీజన్ కి వ్యాఖ్యాత గా అదరగొట్టేసాడు. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన సీజన్ క్రేజ్ మామూలుది కాదు. తరవాత సీజన్స్ కూడా ఎన్టీఆర్ హోస్ట్ చేస్తాడనుకుంటే ఎన్టీఆర్ డేట్స్ కుదరడం లేదంటే చల్లగా జారుకున్నాడు. అయితే తాజాగా ఎన్టీఆర్ మరోసారి బుల్లితెర మీద సందడి చేయబోతున్నాడట. అంటే ఎన్టీఆర్ మరోసారి ఓ షో కి వ్యాఖ్యాతగా రాబోతున్నాడట. అది కూడా జెమిని ఛానల్ ప్లాన్ చేసి ఓ భారీ షో ఎన్టీఆర్ చేయబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ జెమిని ఛానల్ కోసం చెయ్యబోయే షో కోసం ఇప్పటికే జెమిని ఛానల్ యాజమాన్యం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ సెట్ కూడా వేసిందట.

Advertisement
CJ Advs

ఎన్టీఆర్ చెయ్యబోయే షో ఏర్పాట్లు గట్టిగా జరుగుతున్నాయని.. దాని కోసం ఎన్టీఆర్ లుక్ కూడా మార్చబోతున్నాడనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. అయితే ఎన్టీఆర్ జెమిని ఛానల్ లో చెయ్యబోయే ఆ షో ఏమిటో అనే ఆసక్తి అందరిలో మొదలయ్యే లోపే.. ఎన్టీఆర్ చేయబోతే అమితాబచ్చన్, నాగార్జున హోస్ట్ చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు టైప్ షో అని కొందరూ.. కాదు నాగ్ చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు షో ఇప్పుడు స్టార్ మా నుండి జెమిని ఛానల్ చేజిక్కించుకుంది. అందుకోసమే ఎన్టీఆర్ ని రంగంలోకి దింపి షోకి హైప్ క్రియేట్ చెయ్యబోతున్నారంటూ కథలు కథలుగా వార్తలు ప్రచారంలోకొస్తున్నాయి. మరి RRR తో ఎన్టీఆర్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాడో కానీ.. ఇప్పుడు బుల్లితెర మీద సందడి చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. మరి ఎన్టీఆర్ ఫాన్స్ కి పండగే పండగ.

NTR New Host in Gemini Special Show?:

Jr NTR will be doing a TV show for Gemini TV very soon!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs