Advertisement
Google Ads BL

నువ్వు ముద్దుపెడతా అంటే దేవరకొండ ఒప్పుకోవాలిగా!


విజయ్ దేవరకొండ అంటే పడి చచ్చిపోతున్న హీరోయిన్స్ లిస్ట్ రోజు రోజుకి పెరిగిపోతుంది. విజయ్ రౌడీ స్టయిల్ కి హీరోయిన్స్ ఎప్పుడో పడిపోయారు. టాలీవుడ్ మాత్రమేనా కోలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు విజయ్ దేవరకొండ క్రేజ్ కి హీరోయిన్స్ పడిపోతున్నారు. తాజాగా హీరోయిన్ తమన్నా అయితే తాను లిప్ లాక్ లకు వ్యతిరేఖం కానీ.. విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే నా పద్దతులను విజయ్ దేవరకొండ కోసం పక్కనబెట్టి.. లిప్ లాక్ ఇవ్వమన్నా, ముద్దు ఇవ్వమన్నా విజయ్ కి ఇచ్చేస్తా అంటుంది. విజయ్ హీరో అయితే తాను లిప్ లాక్ ఇవ్వడానికి మొహమాటపడను అంటూ పబ్లిక్ గా చెబుతుంది.

Advertisement
CJ Advs

సమంత సామ్ జామ్ షోకి వచ్చిన తమన్నాని సమంత ని రకరకాల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇద్దరు ముద్దుగుమ్మలు ఒకే స్టేజ్ మీద సందడి చేస్తే ఆ మజానే వేరు. అలాగే ఎవరికీ తెలియని ప్రశ్నలు అడిగి హీరోయిన్స్ చేత నిజాలు చెప్పిస్తే.. అందరిలో అదోరకమైన ఇంట్రెస్ట్. మరి సమంత కూడా తమన్నాని చేసిన ఇంటర్వ్యూ లో తమన్నా చేత చాలా విషయాలే బయటపెట్టించింది. అందులో భాగంగానే తాను హీరోలకు ముద్దు పెట్టాల్సి వస్తే.. ఆ సీన్స్ చెయ్యను అని దర్శకుడికి మొహమాట పడకుండా చెబుతా అని.. గ్లామర్ షో చెయ్యాలంటే దానమికి మనం ఇష్టపడితేనే చేస్తాం అంటుంది తమన్నా. కానీ విజయ్ దేవరకొండ హీరో అయితే తన రూల్స్ పక్కనబెట్టి ముద్దు సీన్ కి ఓకె చెబుతా అంటుంది తమన్నా. మరి తమన్నాకి ఓకె.. కానీ విజయ్ దేవరకొండ తమన్నాకి ముద్దు పెట్టే అవకాశం ఇవ్వాలిగా అంటున్నారు నెటిజెన్లు. ఎందుకంటే తమన్నా ఫెడవుట్ కి దగ్గరగా ఉన్న హీరోయిన్ కదా అంటున్నారు.

Tamanaah breaks her rules for him:

Tamannah and Samantha from the latest episode of SamJam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs