Advertisement
Google Ads BL

F3 హీరోయిన్స్ ధమాకా! భార్యలు - ప్రియురాళ్లు!


అనిల్ రావిపూడి తెరకెక్కించిన కామెడీ ఎంటర్టైనర్ F2 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దిల్ రాజు F3 ని భారీ లెవల్లో భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కించే ప్లాన్ లో టీం ఉంది. ఇప్పటినుండే అనిల్ రావిపూడి ఎఫ్ 3 పై అంచనాలు పెంచేస్తున్నాడు. కామెడీ నవ్వుల వ్యాక్సిన్ వచ్చేస్తుంది అంటూ ఊరిస్తున్నాడు. వచ్చే వారంలో పూజా కార్యక్రమాలతో మొదలు కాబోతున్న ఎఫ్ 3 సినిమాలో వెంకటేష్ - వరుణ్ తేజ్ లతో పాటుగా మరో హీరో కూడా ఉండబోతున్నాడనే టాక్ ఉండగా.. ఎఫ్ 2 లో కామెడీ బ్రదర్స్ గా కామెడి పండించిన వెంకీ - వరుణ్ లు ఎఫ్ 3 లోను మ్యాజిక్ చేస్తారట. ఎక్కడా కామెడీ మిస్ కానీ కేరెక్టర్స్ ని అనిల్ వాళ్ళ కోసం రాసుకున్నాడట.

Advertisement
CJ Advs

అయితే ఈసారి అనిల్ రావిపూడి కేవలం కామెడీని మాత్రమే నమ్ముకోవడం లేదట. గ్లామర్ ని కూడా నమ్ముకుంటున్నాడట. ఎఫ్ 2 లో తమన్నా, మెహ్రీన్ లతో బికినీ షో చేయించిన అనిల్.. ఎఫ్ 3 లో వెంకీ ఓ గర్ల్ ఫ్రెండ్, వరుణ్ కి ఓ గర్ల్ ఫ్రెండ్ ని తీసుకురాబోతున్నాడట. వెంకీ వైఫ్ గా తమన్నా, వరుణ్ వైఫ్ గా మెహ్రీన్ నటిస్తారని.. ప్రియురాళ్లుగా మరో ఇద్దరు హీరోయిన్స్ ని అనిల్ తీసుకురాబోతున్నాడట. అంతేకాకుండా ఐటెం గర్ల్ గా మరో టాప్ హీరోయిన్ ని ఎఫ్ 3 లోకి తేబోతున్నాడట అనిల్. మరి ఈ లెక్కన ఎఫ్ 3  కి ఐదుగు హీరోయిన్స్ అన్నమాట. అంటే ఎఫ్ 3 మొత్తం హీరోయిన్స్ ధమాకా. వెంకటేష్ - వరుణ్ లు భార్యలకు తెలియకుండా లవర్స్ తో చేసే కామెడీ రచ్చ సినిమాకి హైలెట్ అంటున్నారు.

F3 Heroine Dhamaka! Wifes and Girlfriends!:

More Heroines in F3
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs