Advertisement
Google Ads BL

బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్: కంటెస్టెంట్స్ కన్నీళ్లు!


బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ లతో అవినాష్, హరికలు బాగా ఎంటర్టైన్మెంట్ అందించారు. అవినాష్ అయితే ఎవరికీ తెలియకుండా కూరల్లో ఉప్పు, లబ్బర్ బ్యాండ్స్ కలపడం లాంటివి చేస్తే.. హారిక అవినాష్ కి కోపం తెప్పించడం, అమ్మ రాజశేఖర్ ని మొహం మీద కాఫీ కొట్టడం లాంటివి చేసేసింది. మరి ఇప్పుడు కూడా బిగ్ బాస్ హౌస్ లో సీక్రెట్ టాస్క్ ల హడావిడి ఏమైనా ఉందేమో అనే అనుమానం.. బుల్లితెర ప్రేక్షకుల్లో మొదలయ్యింది. అలా ఎందుకు అనుకుంటున్నారంటే.. హౌస్ మొత్తం ఏడుస్తూ జనాలని ఏడిపిస్తునారు. మొన్న రాత్రి మోనాల్ గుక్కపెట్టి ఏడిస్తే.. నిన్న రాత్రి హౌస్ లో ఏడుపు రచ్చ మాములుగా లేదు.

Advertisement
CJ Advs

అరియనా పాప కింద  పడి ఏడుస్తూ ఎవరి మాట వినకుండా సోహైల్ తో గొడవ పెట్టుకుంది. సోహైల్ అయితే బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లో కెళ్ళి ఏడుపు స్టార్ట్ చేసాడు. నా కోపం నాకు ఇబ్బంది.. మిగతావన్నీ సూపర్ అంటూ ఏడవడం మొదలు పెట్టాడు. సోహైల్ ని ఊరుకోబెట్టడానికి అఖిల్ ఏడవడం అబ్బో ఇదేదో బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ లా అనిపిస్తుందని కామెంట్స్ పడుతున్నాయి. లేదంటే మరీ అంత ఏడవల్సిన అవసరం లేదు.. వాళ్ళ ఏడుపుకి మనం ఎమోషన్ అవడం కాదు.. వాళ్ళ ఏడుపు చూస్తే కామెడీగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు బిగ్ బాస్ ప్రేక్షకులు.

Bigg Boss Secret Task: Contestants in Tears!:

Monal - Sohail - Ariana Crying in Bigg boss house
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs