Advertisement
Google Ads BL

ప్రభాస్ సలార్ హీరోయిన్స్ వాళ్లేనా?


ప్రభాస్ వరస సినిమాలతో బిజీగా ఉండేసరికి చాలామంది హీరోయిన్స్ లో ఎన్నో ఆశలు ఉన్నా.. ప్రభాస్ పక్కన నటించే ఛాన్స్ మాత్రం కొందరికే దక్కుతుంది. రాధేశ్యాం లో పూజ హెగ్డే తో రొమాన్స్ చేస్తున్న ప్రభాస్ నాగ్ అశ్విన్ మూవీలో దీపికా పదుకొనేతో రొమాన్స్ చెయ్యబోతున్నాడు. దీపికా - ప్రభాస్ జోడికి ఊహకే అందనంత క్రేజ్ ఉంది. ఇక ఆదిపురుష్ లో ప్రభాస్ కి సీత పాత్రలో బాలీవుడ్ భామ కృతి సనన్ నటించే ఛాన్స్ ఉందనే టాక్ సోషల్ మీడియాలో వినబడుతుంది. అయితే అది ఇంకా కన్ఫర్మ్ కాకపోయినా.. కృతిసనన్ ని ఓం రౌత్ ఎంపిక పూర్తి చేసినట్లుగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఇక ఇప్పుడు ప్రభాస్ సలార్ హీరోయిన్స్ రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement
CJ Advs

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ చెయ్యబోయే మాస్ మసాలా సలార్ లో ప్రభాస్ నాయకుడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని అంటున్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎంపిక కూడా చేపట్టినట్టుగా మీడియా టాక్. ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ భామలైన దిశా పటాని, సారా అలీఖాన్ లు ప్రశాంత్ నీల్ మదిలో ఉన్నారని.. దిశా కానీ, సారా కానీ ప్రభాస్ పక్కన పర్ఫెక్ట్ జోడిలని అంటున్నారు. మరోపక్క బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే టాప్ రేంజ్ కి వెళుతున్న దిశా కానీ, సైఫ్ కూతురు సారా అలీ ఖాన్ లు సలార్ లో నటిస్తే సినిమాకి మరింత హైప్ వస్తుంది అని.. ప్రభాస్ ఫాన్స్ తెగ ఇదైపోతున్నారు. మరి సలార్ లో ప్రభాస్ తో రొమాన్స్ చెయ్యబోయే హీరోయిన్స్ మాత్రం దిశా పటాని, సారా అలీఖాన్ అంటూ సోషల్ మీడియాలో గట్టిగానే ప్రచారం జరుగుతుంది.

Salaar: Two Heroines for Prabhas Confirmed?:

<span>Disha Patani and Sara Ali Khan are likely to romance Prabhas in this film</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs