Advertisement
Google Ads BL

బిగ్ బాస్ ప్రేక్షకులు అంత ఎమోషనల్ ఫూల్స్ కాదు!


బిగ్ బాస్ సీజన్ 4 లో లవ్ ట్రాక్స్, మోనాల్ గజ్జర్ ఎమోషనల్ సీన్స్, ఆమె గ్లామర్ తప్ప ఆసక్తికరమైన టాస్క్ లు కానీ, మరే విధమైన స్టఫ్ కానీ లేదు. మోనాల్ గజ్జర్ ఉంటే అఖిల్ తో లేదంటే ఏడవడం తప్ప ఆమె బిగ్ బాస్ హౌస్ లో చేసింది ఏమి లేదు. అఖిల్ నుండి దూరమయ్యాక గత మూడు వారాలుగా కాస్త గేమ్ మీద ఫోకస్ పెట్టింది కానీ.. ఇంతవరకు మోనాల్ ని సూపర్ అన్నోళ్లు లేరు. ప్రతి దానికి ఎమోషనల్ అయ్యి ప్రేక్షకులను ఫూల్స్ చెయ్యడంలో మోనాల్ ది ప్రత్యేకమైన స్థానం. బిగ్ బాస్ లో మోనాల్ ఏడుపు కి ముందు వారాల్లో సింపతీ క్రియేట్ అయినా.. ప్రస్తుతం మోనల్ ఏడుపు చూసిన అందరికి చిరాకు పుడుతుంది.

Advertisement
CJ Advs

బిగ్ బాస్ నుండి ఏ ఐదో వారమో ఎలిమినేట్ అవుతుంది అనుకున్న మోనాల్ 13 వారాలు హౌస్ లో ఉంది అంటే కారణం బిగ్ బాస్ చేసిన హెల్ప్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక తాజాగా బిగ్ బాస్ లో మోనాల్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అఖిల్ దూరమైప్పటినుండి ఒంటరిగా ఫీలవుతున్న మోనాల్ కి దొరికిందే సందు ఏడుపు స్టార్ట్ చేస్తుంది. మంగళవారం ఎపిసోడ్ లో మోనాల్ ఎలాంటి ఎక్సప్రెషన్ లేకుండా లాన్ లోని కుర్చీ మీద కూర్చోవాల్సి ఉంటే.. 

హౌస్ మేట్స్ అంతా ఆమెని నవ్వించాలి, కోపం తెప్పించాలి, ఏడిపించాల్సి ఉండగా.. అరియనా, మోనాల్ తన మీద పాగా తీర్చుకోవడానికి తన బొమ్మని విసిరేసిన కారణంగా.. నువ్వు హౌస్ లో ఉండడానికి ఏ మాత్రం ఆర్హురాలివి కావు అనగానే.. మోనాల్ సైలెంట్ గా చూస్తుంది కానీ ఏడవలేదు. కానీ అఖిల్ తన ఎక్సప్రెషన్స్ 10 అని వెయ్యగానే... మోనాల్ ఎక్కి ఎక్కి గుక్కపెట్టి ఏడ్చేసింది. 

దానితో బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి మోనాల్ నువ్వు సూపర్, నువ్వు బాగా ఆడబట్టే ఇన్ని వారలు హౌస్ ఉన్నావ్ అంటూ నచ్చ చెప్పడంతో మోనాల్ ఏడుపు ఆపింది. లేదంటే బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ ఏడుపుకి కంటెస్టెంట్స్ కి కూడా చిరాకు పడేవాళ్ళే. మరి అరియనా అంతగా హార్ట్ చేసిన మోనాల్ ఆ కుర్చీలో ఏడవకుండా అలానే కూర్చుంది. కానీ బజార్ మోగగానే ఏడ్చింది అంటే.. బిగ్ బాస్ ప్రేక్షకులని ఎమోషనల్ ఫూల్స్ అనుకుంటుందేమో మోనాల్ అంటూ ఆమెని తిట్టిపోస్తున్నారు నెటిజెన్స్.

Bigg Boss audience are not emotional fools!:

Bigg boss 4: Monal Emotional When Ariyana Confronted
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs