Advertisement
Google Ads BL

ఫిబ్రవరి 11 నుండి డేట్స్ కన్ఫర్మ్ చేసిన చిరు!


చిరంజీవి ఆచార్య షూటింగ్ కి కొద్దిపాటి విరామం ఇచ్చి నాగబాబు కూతురు నిహారిక పెళ్లి కోసం రాజస్థాన్ వెళ్ళాడు. రాజస్థాన్ నుండి రాగానే ఆచార్య సెట్స్ లో జాయిన్ అవుతాడట చిరంజీవి. కొరటాల శివ ఓ భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేసి.. ఆచార్య షూటింగ్ ని నిర్విరామంగా చిత్రీకరణ చేస్తున్నాడు. అయితే చిరంజీవి ఆచార్య సినిమా తర్వాత మెహర్ రమేష్ తో వేదాళం రీమేక్ పట్టాలెక్కించబోతున్నాడు.. అది కూడా ఏప్రిల్ నుండి షూటింగ్ మొదలు పెట్టబోతున్నారనే టాక్ నడుస్తుంది. చిరంజీవి వేదాళం రీమేక్ స్క్రిప్ట్ ని మెహర్ సిద్ధం చెయ్యడమే కాదు.. ఇప్పటికే కలకత్తా కాళీమాత దసరా ఉత్సవాల చిత్రీకరణ చేసాడని.. సో చిరు వేదాళం ఏప్రిల్ నుండి సెట్స్ మీదకెళుతుంది అని అనుకున్నారు.

Advertisement
CJ Advs

అసలు ఆచార్య తర్వాత చిరు లూసిఫెర్ రీమేక్ ఒప్పుకున్నాడు. కానీ ఆ రీమేక్ కోసం అనుకున్న దర్శకులు లూసిఫెర్ రీమేక్ స్క్రిప్ట్ విషయంలో వీక్ గా ఉండడంతో అది పక్కనబెట్టి చిరు ముందు వేదాళం రీమేక్ చెయ్యాలనే అనుకున్నాడు. కానీ లూసిఫెర్ రీమేక్ కి దర్శకుడు మోహన్ రాజా సెట్ అవడం, తెలుగు నేటివిటీకి దగ్గరగా లూసిఫర్ రీమేక్ స్క్రిప్ట్ రాసుకుని చిరు నుండి గ్రీన్ సిగ్నల్ కూడా తెచ్చేసుకోవడంతో ఇప్పుడు చిరు లూసిఫర్ నే ముందు సెట్స్ మీదకి తీసుకెళ్ళబోతున్నాడట. మోహన్ రాజా - చిరు లూసిఫెర్ రీమేక్ షూటింగ్ ఫిబ్రవరి 11 న మొదలుపెట్టబోతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. చిరంజీవి ఫిబ్రవరి 11 నుండి లూసిఫెర్ రీమేక్ కి డేట్స్ కేటాయించినట్లుగా తెలుస్తుంది. ఇక చిరంజీవి - మోహన్ రాజా లూసిఫెర్ రీమేక్ సెట్స్ మీదుండగానే అంటే ఆగష్టు నుండి చిరు - మెహర్ రమేష్ ల వేదాళం రీమేక్ కూడా పట్టాలెక్కుతుందని అంటున్నారు.

Chiru confirmed dates from February 11!:

Chiru - Mohan raja combo movie shooting commencing Feb 11th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs