నాగబాబు కూతురు నిహారిక పెళ్లి వేడుకలు రాజస్థాన్ లోని ఉదయపూర్ లో అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. రేపు జరగబోయే పెళ్లి కోసం ఇప్పటికే మెగా ఫ్యామిలిలో చిరంజీవి సహా ఆయన భార్య సురేఖ, రాంచరణ్, ఉపాసన, అల్లు ఫామిలీ, సాయి ధరమ్ ఫామిలీస్ అందరూ రాజస్థాన్ కి వెళ్లిపోయారు. అక్కడ గత రాత్రి జరిగిన నిహారిక సంగీత్ లో రామ్ చరణ్, అల్లు అర్జున్ స్టేజ్ డాన్స్ హైలెట్ అవగా, నిహారిక - చైతన్య డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక చిరంజీవి తన ముద్దుల చిన్నారి నిహారికకు కోట్లు విలువ చేసే బహుమతులను ఇవ్వడమే కాదు... పెళ్లి అవ్వకముందే నిహారిక అప్పగింతలు చేసేసాడు.
ట్విట్టర్ లో చిరంజీవి అరుదైన ఫొటోస్ ని పోస్ట్ చేసాడు. చిన్నప్పుడు నిహారికకు ఎత్తుకున్న ఫోటో తో పాటుగా.. నిహారిక పెళ్లి కూతురుని చేసినప్పుడు చిరు తో సెల్ఫీ దిగిన అరుదైన ఫొటోస్ ని పోస్ట్ చెయ్యడమే కాదు.. మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా, కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు , ఆశీస్సులు. God bless you! అంటూ నిహారికాని చైతన్య చేతిలో పెట్టి అప్పగింతలు చేసేసాడు. మరి నాగబాబు కూతురు నిహారికాని చిరు తన కూతుళ్లు శ్రీజ, సుస్మిత లతో పాటుగా ప్రేమతో చూసేవాడు. ఇప్పుడు చిరు బహుమతులు, ఆయన నిహకి ఇచ్చిన ఆశీస్సులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.