Advertisement
Google Ads BL

కాజల్ హనీమూన్ లో రెచ్చిపోవడానికి కారణం అదా?


కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30 న ప్రేమికుడు గౌతమ్ కిచ్లుని కుటుంబ సభ్యుల మధ్యన కరోనా నిబంధనల మేరకు పెళ్ళాడి.. ఆ వెంటనే మాల్దీవులకు హాని మూన్ ట్రిప్ వేసింది. కాజల్ హాని మూన్ ట్రిప్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పాటుగా కాజల్ ట్రోలింగ్ కి గురైంది. కాజల్ అగర్వాల్ హానిమూన్ ఫొటోస్ ని షేర్ చేసినప్పుడల్లా.. కాజల్ నువ్వు హానిమూన్ ఫొటోస్ తో పబ్లిసిటీ చేసుకుంటున్నావా అంటూ నెటిజెన్స్ కాజల్ ని ట్రోల్ చేసేవారు. కాజల్ అగర్వాల్ అండర్ వాటర్ రెస్టారెంట్ ఫొటోస్ దగ్గరనుండి.. భర్త కిచ్లు తో రొమాంటిక్ డేట్ మరియు సముద్రంలో కాజల్ అగర్వాల్ లంచ్ పార్టీ అబ్బో.. కాజల్ హానిమూన్ ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడల్లా తెగ వైరల్ అయ్యాయి. అంతేకాకుండా కాజల్ అగర్వాల్ హాని మూన్ ఖర్చుపై సోషల్ మెడిలో ఓ రేంజ్ పబ్లిసిటీ వచ్చింది. కాజల్ తన హానిమూన్ కోసం ఐదు కోట్లు ఖర్చు పెట్టింది అంటూ కాజల్ ని ఆడుకున్నారు. అయితే కాజల్ అగర్వాల్ తన హనీమూన్ ట్రిప్ ని అలా పబ్లిసిటీ చెయ్యడానికి ఓ కారణం ఉందట.

Advertisement
CJ Advs

అది కాజల్ అగర్వాల్ రూపాయి ఖర్చు లేకుండా మాల్దీవుల్లో హానిమూన్ ఎంజాయ్ చేసిందట. అంటే కాజల్ అగర్వాల్ హానిమూన్ ట్రిప్ ఫ్రీగా జరగడానికి కారణం ఆమె ఇన్స్టా ఫాలోయర్స్ అంట.  కాజల్ అగర్వాల్ - గౌత కిచ్లుల హాని మూన్ కి మాల్దీవుల్లో ఓ ప్రముఖ అండర్ వాటర్ రెస్టారెంట్ అయిన మురాక హోటల్ ఫ్రీ ఆఫర్ ఇచ్చిందట. అక్కడ ద మురాక హోటల్ అంటే అండర్ వాటర్ రెస్టారెంట్ లో కాజల్ జంట ఓ 10 రోజుల పాటు ఎంజాయ్ చేసింది. అక్కడ ఒక్క నైట్ స్టే చెయ్యడానికి గాను 38 లక్షలు ఖర్చు అవుతుందట. అలా అయితే కాజల్ అగర్వాల్ కి 5 కోట్లు ఖర్చు అయ్యేది. కానీ కాజల్ కి కి మురాక హోటల్ ఫ్రీ ఆఫర్ ఇచ్చింది.

ఎందుకు, ఎలా అంటే మాల్దీవుల్లో కొన్ని హోటల్స్ ఇన్స్టాలో భారీ అంటే రెండు మిలియన్ ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీస్ కి ఫ్రీ ఫుడ్ ఆఫర్ ఇస్తుందట. అదే ఐదు మిలియన్ ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీస్ కి హోటల్ రూమ్స్ ఫ్రీగా ఇస్తారట. మరి కాజల్ అగర్వాల్ కి ఇన్స్టాగ్రామ్ లో 16 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న కారణంగా మాల్దీవుల మురాక హోటల్ వాళ్ళు  కాజల్ కి అండర్ వాటర్ రెస్టారెంట్ లో ఫ్రీగా బస చేందుకు గాను ఫ్రీ ఆఫర్ ఇచ్చిందట. కాజల్ జంటకి ఫోన్ చేసి మీరు వేసుకునే దుస్తులు తెచ్చుకుంటే చాలు మిగతావన్నీ ఫ్రీ అని చెప్పడంతో కాజల్ జంట మాల్దీవుల్లో వాలిపోయిందట. హనీమూన్ ఫ్రీగా దొరకడంతోనే కాజల్ అలా రెచ్చిపోయిందట. మరి హాట్ ఫోటో షూట్స్ తో కాజల్ జంట మాల్దీవుల భీభత్సం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. 

Kajal didn't have to pay a penny!:

Kajal Agarwal sponsored the suite in Instagram
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs