Advertisement
Google Ads BL

సైలెంట్ అయిన అక్కినేని హీరోలు!


అక్కినేని హీరోలైన నాగార్జున, అఖిల్, నాగ చైతన్యలు ప్రస్తుతం చాలా సైలెంట్ గా ఉన్నారు. నాగార్జున వైల్ డాగ్ నెట్ ఫ్లిక్స్ నుండి విడుదలవుతుంది అని అన్నారు కానీ.. నాగార్జున ఎక్కడా ఓటిటి గురించి మాట్లాడ్డం లేదు. వారం వారం బిగ్ బాస్ స్టేజ్ మీదకొస్తున్నాడు, వెళుతున్నాడు. మరోపక్క నాగ చైతన్య లవ్ స్టోరీ ముచ్చట సోషల్ మీడియాలో వినిపించడం లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతు - సాయి పల్లవిలు కలిసి నటించిన లవ్ స్టోరీ షూటింగ్ పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది. మరి ఈ సినిమా సంక్రాంతికి అనడమే కానీ.. మూవీ యూనిట్ క్లారిటీ ఇవ్వడం లేదు.

Advertisement
CJ Advs

మరోపక్క అఖిల్ - బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సంక్రాంతికి అంటున్నారు కానీ.. హడావిడి లేదు. మూడు సినిమాల ప్లాప్స్ తర్వాత ప్లాప్ డైరెక్టర్ తో జోడి కట్టిన అఖిల్ కి ఈ సినిమా హిట్ అత్యంత అవసరం. మరి ఈ సినిమా సంక్రాతి రేస్ నుండి తప్పుకుంది కాబట్టే సైలెంట్ గా ఉన్నారని.. వేసవిలో విడుదలయ్యే ఛాన్సెస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోపక్క అఖిల్ సినిమా ఓటిటికి అమ్మేసేలా ఉన్నారంటున్నారు. అసలు అక్కినేని హీరోలు ఎవరూ ఇప్పుడు సినిమాల గురించి మాట్లాడడం లేదు. చైతు ఈమధ్యనే సమంత తో కలిసి మాల్దీవులకు ట్రిప్ వేసాడు. నాగ్ మాత్రం హైదరాబాద్ లోనే ఉన్నాడు. మరోపక్క అఖిల్ గుర్రమెక్కి స్వారీ చేస్తున్నాడు. కానీ వీళ్ళ సైలెన్స్ మాత్రం ఎవరికీ అర్ధం కావడం లేదు.

Why Akkineni Heroes completely hushed!:

Why Nag - Chaitu - Akhil completely hushed!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs