Advertisement
Google Ads BL

ప్రభాస్ కోసం భారీ మార్పులు!


ప్రభాస్ తో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతల  ఆసక్తి ఎలా ఉంది అంటే.. ప్రభాస్ ఎప్పుడు ఫ్రీ అయినా అంటే కొన్నేళ్ళకి ఫ్రీ అయినా ఇప్పుడే ప్రభాస్ కి కథ చెప్పి కమిట్ చేయించేసుకుని పక్కనబెట్టేంత ఆసక్తి ఉంది. తాజాగా ప్రభాస్ నాలుగు ఫ్యాన్ ఇండియా మూవీస్ తో దర్శకనిర్మాతలకు ఊపిరాడనివ్వడం లేదు. ప్రస్తుతం రాధేశ్యాం సెట్స్ మీదున్న ప్రభాస్ తర్వాత నాగ్ అశ్విన్ - ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాలను ఏక కాలంలో పూర్తి చేసే ఏర్పాట్లలో ఉన్న ప్రభాస్ కి ప్రశాంత్ నీల్ ఓ రీమేక్ కథ చెప్పి ఒప్పించి అధికారిక ప్రకటన ఇప్పించాడు. ప్రశాంత్ నీల్ - ప్రభాస్ కాంబోలో సలార్ మూవీ ప్రకటన వచ్చేసింది.

Advertisement
CJ Advs

అయితే సలార్ మూవీని ప్రశాంత్ నీల్ కన్నడ సినిమా ఉగ్రమ్‍ కి రీమేక్ గా తెరకెక్కించబోతున్నాడనే ప్రచారం ఉంది. ఆ సినిమా మస్ మసాలా కథతోనే తెరకెక్కింది. అయితే ప్రభాస్ కూడా ఇప్పుడు ఫ్రెష్ కథలతో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న టైంలో ఓ రీమేక్ కోసం ప్రశాంత్ నీల్ తో చేతులు కలపడం ప్రభాస్ ఫాన్స్ కి అర్ధం కాకపోయినా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వం మీదున్న నమ్మకంతో సైలెంట్ గా ఉన్నారు. అయితే అమాయకమైన కుర్రాడు.. అంత మాస్ గా మాఫియా వాళ్లనే మట్టికరిపించి నాయకుడిగా ఎలా మారాడో అనేది సలార్ కథ అని ప్రశాంత్ నీల్ చెప్పాడు. అయితే కన్నడ సినిమా ఉగ్రమ్‍ ని ప్రభాస్ క్రేజ్ కి అనుగుణం, ప్రభాస్ ఇమేజ్ కి సరిపోయేలా.. కథని సమూలంగా మార్పులు చేర్పులు చేసాడట. మరి ఈ సినిమాని కూడా ప్రభాస్ కోసం ప్రశాంత్ నీల్ భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తాడని తెలుస్తుంది. రీమేక్ అయినా ప్రభాస్ కోసం ఎక్కడా తగ్గేది లేదు అని ప్రశాంత్ నీల్ ఫిక్స్ అయ్యాడట.

Huge changes for Prabhas!:

To suit the image of Prabhas in Kannada, director to make changes in the story
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs