చిరంజీవి - కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ ని కొరటాల నిర్విరామంగా చిత్రీకరిస్తున్నాడు. చిరంజీవి నిహారిక పెళ్లి కోసం కొద్దిపాటి విరామం తీసుకుని రాజస్థాన్ కి వెళ్ళాడు. అయితే ఈ సినిమాలో రాంచరణ్ కూడా 30 నిమిషాల కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఆ 30 నిమిషాల రోల్ లో రామ్ చరణ్ కి ఓ హీరోయిన్ ఉంటుంది అని, అలాగే ఆ హీరోయిన్ తో డ్యూయెట్ ఉంటుంది అంటూ కొరటాల కన్ఫర్మ్ కూడా చేసాడు. మరి చరణ్ సరసన ఏ హీరోయిన్ నటిస్తుందో అనే క్యూరియాసిటీ అందరిలో ఉంది. ఎందుకంటే చిరు సరసన గ్లామర్ గర్ల్ కాజల్ అగర్వాల్ నటిస్తుండగా చరణ్ కి సమంత కానీ రష్మిక కానీ హీరోయిన్ నటించే ఛాన్స్ ఉందంటూ ప్రచారం జరుగుతుంది.
కానీ ఇప్పుడు చరణ్ సరసన సమంత కానీ, రష్మిక కానీ హీరోయిన్స్ గా అనుకోలేదని.. కొరటాలకి చరణ్ రోల్ కోసం ముందు నుండి బాలీవుడ్ భామని తేవాలని అనుకుంటున్నాడట. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్స్ లిస్ట్ కొరటాల చేతిలో ఉందని.. రామ్ చరణ్ కోసం బాలీవుడ్ భామనే కోరటాల ఎంపిక చేస్తాడని తెలుస్తుంది. RRR లో చరణ్ సరసన అలియా భట్ నటిస్తుండగా.. ఇప్పుడు కొరటాల మరో బాలీవుడ్ భామని చరణ్ కోసం దింపబోతున్నాడట. మరి సమంత కానీ, రష్మికా కాని చరణ్ కి ఆనలేదా..? లేదా కొత్త గా ఉంటుంది, క్రేజ్ ఉంటుంది అని బాలీవుడ్ భామని చూస్తున్నారా అని అంటున్నారు కొందరు.