తెలంగాణ రాష్ట్రాన్ని విడగొట్టాలి.. ఆంద్రోళ్ళు ఆంధ్రోళ్లే. తెలంగాణ వాళ్ళని కాదని.. మా ఉద్యోగాలన్నీ సీమాంధ్రులకే దక్కుతున్నాయి.. మా తెలంగాణ మాకు కావాలి.. సీమాంధ్రులు వెళ్ళిపోవాలి అనే నినాదంతో కేసీఆర్ తెలంగాణ లో టీఆరెస్ జెండా పాతాడు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం అనౌన్స్ చెయ్యగానే.. కేసీఆర్ తెలంగాణ సీఎం గా అందలమెక్కాడు. అప్పటి నుండి సెటిలర్స్ అయినా సీమాంధ్రులని ఏదో సంధర్భంలో తూలనాడుతూనే వున్నాడు కేసీఆర్. తర్వాత మళ్ళి సీమాంధ్రులు కూడా తెలంగాణాలో ఉండొచ్చు అంటూ ఎన్నికల స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సీమాంధ్రులు మా అన్నాతమ్ములు, వారికి కాలిలోముల్లు దిగితే పంటితో తీస్తాం, వారిని కడుపులో పెట్టుకుని చూచుకొంటాం అంటూ స్టేట్మెంట్లు ఇచ్చాడు KCR. ఆలా సీమాంధ్రులను తన వైపు తిప్పుకున్నాడు. ఇక తెలంగాణ వాదాన్ని ప్రజల గుండెల్లో నాటిన కేసీఆర్ కి దుబ్బాక ఉప ఏన్నిక వరకు తిరుగు లేకుండానే పోయింది. కానీ దుబ్బాక ఉప ఎన్నికలో బిజెపి స్ట్రాంగ్ గా జెండా పాతేసింది. దెబ్బకి టీఆరెస్ కి దెయ్యం దిగింది.
ఇక తాజాగా జిహెచ్ఎంసి ఎన్నికల్లో టీఆరెస్ కనకష్టం మీద 56 సీట్లు గెలుచుకుంది. 56 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించిన టీఆరెస్ కి కేసీఆర్ కి తెలంగాణ ప్రజలు హ్యాండ్ ఇచ్చారు. కానీ కేసీఆర్ తో నానా తిట్లు తింటూ ఇక్కడే హైదరాబాద్ ని పట్టుకుని వేలాడుతున్న సీమాంధ్రులు మాత్రం కేసీఆర్ ని సపోర్ట్ చేస్తూ టిఆర్ఎస్ కి 56 సీట్లు వచ్చేలా చేసారు. సెటిలర్స్ ఉన్న ప్రాంతంలోనే టీఆరెస్ గ్రేటర్ సీట్లని గెలవడం చూసిన వారంతా.. మెజారిటీ తెలంగాణ ఓటర్లు ఛీ కొడితే, తమను గత కొన్నేళ్లుగా ఛీ కొడుతున్న కేసీఆర్ పట్ల కృతజ్ఞతతో ఓట్లేసి కేసీఆర్ పరువును.. పార్టీ ప్రతిష్టను.. సీమాంధ్ర ప్రజలు కాపాడి ఒడ్డున పడేసారనడంలో ఈ ఎన్నికలే సాక్ష్యం అంటున్నారు. సీమాంధ్రులు నివసించే డివిజన్స్ లోనే టీఆరెస్ గెలుపు జెండా ఎగరెయ్యడం చూసిన ప్రతి ఒక్కరి నోటా ఇదే మాట.