Advertisement
Google Ads BL

ఆదిపురుష్ విలన్ లంకేశ్ విశ్వరూపం!


ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ ఆదిపురుష్ ఫ్యాన్ ఇండియా మూవీని జనవరి నుండి మొదలు పెట్టబోతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ ని రాముడిగా చూపించబోతున్నాడు ఓం రౌత్. అయితే ప్రభాస్ ని ఈ సినిమాలో ఢీ కొట్టబోయే లంకేశ్ పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ ని ఎంపిక చేసాడు ఓం రౌత్. అయితే ప్రభాస్ ముందు సైఫ్ అలీ ఖాన్ తేలిపోతాడేమో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే తాజాగా ఆదిపురుష్ రావణ్ పాత్ర గురిచి సైఫ్ అలీ ఖాన్ మొదటిసారిగా స్పందించాడు. ఆదిపురుష్ తాజా పోస్టర్ లో 10 తలల రావణుడిగా లంకేశ్ పాత్ర కనిపిస్తుంటే.. దానికి కింద బాణం పట్టుకున్న రాముని పాత్రకనబడుతుంది. అయితే ఆదిపురుష్ లో తన పాత్రని అంటే లంకేశ్ పాత్రని ఓం రౌత్ అద్భుతంగా మలిచాడంటున్నాడు సైఫ్ అలీ ఖాన్.

Advertisement
CJ Advs

ఇలాంటి క్రూరమైన రాక్షస పాత్రలు చెయ్యడం కాస్త కొత్తగానూ, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అంటున్నాడు సైఫ్. సీతని ఎత్తుకుపోయినందుకు రాముడి తో యుద్ధం, దానికి దారితీసిన పరిస్థితులతో పాటుగా.. తన చెల్లి సూర్పణఖతో రాముడి తమ్ముడి లక్షణుడు వ్యవహరించిన తీరుకి ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నాలను.. న్యాయంగా చూపిస్తూనే మనిషిగా ఎలాంటి పనులు చేసాడనే దానిని దర్శకుడు ఎంటర్టైనర్ గా చూపించబోతున్నాడు. ఇలాంటి క్రూరమైన రావణ్ పాత్రలు పాడడం చాలా అరుదు.. అంటూ ఆదిపురుష్ లో తన పాత్రని రివీల్ చేసాడు ఆదిపురుష్ రావణ్ సైఫ్ అలీఖాన్. మరి సైఫ్ అలీ ఖాన్ చెప్పినదాన్ని బట్టి.. ఈ సినిమాలో హీరోయిజం తో పాటుగా విలనిజం హైలెట్ అయ్యేలా కనబడుతుంది. 

Adipurush Villain Saif ali khan to be spine-chilling:

Villain Saif ali khan about Adipurush his role 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs