Advertisement
Google Ads BL

పెళ్లి కూతురిగా మెరిసిపోతున్న మెగా డాటర్!


మెగా డాటర్ నిహారిక పెళ్లి మరో నాలుగు రోజుల్లో రాజస్థాన్ లోని ఉదయపూర్ లో జరగబోతుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం ఉదయపూర్ కి పయనమైంది. మెగాస్టార్ చిరు అండ్ చరణ్ తప్ప మిగతా ఫ్యామిలీ మొత్తం రాజస్థాన్ లోనే సందడి చేస్తుంది. చిరు ఆచార్య షూటింగ్ లోను, రామ్ చరణ్ మహాబలేశ్వర్ లో RRR షూటింగ్ లో బిజీగా ఉన్నారు. వారు కూడా త్వరలోనే రాజస్థాన్ కి వెళ్ళబోతున్నారు. నిహారిక పెళ్లి కి సంబందించిన వేడుకలు మెహిందీ, పెళ్లి కూతురు ఫంక్షన్, సంగీత్ ఫంక్షన్స్ లో మెగా ఫ్యామిలీ సందడి మాములుగా లేదు. చిరు కూతుళ్లు శ్రీజ, సుస్మితలు భర్తలతో కలిసి చెల్లి పెళ్ళికి హడావిడి చేస్తున్నారు.

Advertisement
CJ Advs

ఇక సాయి ధర్మ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్ లు పెళ్లి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇక నిహారిక అయితే రోజుకో డిజైనర్ డ్రెస్సుతో మెరిసిపోతుంది. తాజాగా నిహారికకి పెళ్లి కళ కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది. చిలకపచ్చ చీరలో నిహారిక అందంగా ముస్తాబై.. పెళ్లి కూతురిలా వెలిగిపోతుంది. నాలుగు రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న నిహారిక రోజూ వేస్తున్న గెటప్స్ అన్ని పెళ్లి కూతురు గెటప్స్ ని తలపిస్తున్నాయి. చిలకపచ్చ చీరలో బంగారు ఆభరణాల మధ్యన, సిగ్గు పడుతూ.. కూర్చున్న నిహారికాని ఇప్పుడు ఈ టైం లో ఆమెకి కాబోయే భర్త చైతన్య వడ్లమూడి చూస్తే మైమరిచిపోవడం ఖాయం. 

Niharika Bridal Look Goes Viral:

Niharika Konidela - Chaitanya to marry on December 9th 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs