Advertisement
Google Ads BL

నాగ అశ్విన్ - ఆదిపురుష్ ఒకేసారి..!


ప్రభాస్ ఒకేసారి నాలుగు సినిమాలు లైన్ లో పెట్టాడు. రాధేశ్యాం అంటే షూటింగ్ పూర్తి చేసుకోవడానికి రెడీ గా ఉన్న సినిమా. అది లెక్క లేదు. కానీ భారీ బడ్జెట్ మూవీస్ అయిన నాగ్ అశ్విన్, ఆదిపురుష్, తాజాగా ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమాలను ప్రభాస్ ఎన్నేళ్ళకి పూర్తి చేస్తాడు.. అందులోనూ ఫ్యాన్ ఇండియా మూవీస్ కదా.. ఇవేప్పటికీ పూర్తి కావాలనే దిగులుతో స్టార్ దర్శకులే కాదు... ప్రభాస్ ఫాన్స్ కూడా ఉన్నారు. ప్రభాస్ వరస కమిట్మెంట్స్ హ్యాపీ గా ఉత్సహాన్ని ఇచ్చినా.. ఈ సినిమాల్ని పూర్తయ్యి ప్రేక్షకుల ముందుకు రావడానికి 2023 లో లేదంటే 24 పట్టేలా ఉంది అనుకుంటున్నారు. కానీ ప్రభాస్ అంత దూరం పోనివ్వడట. ఫాన్స్ ని బాహుబలిలా ఐదేళ్ళు వెయిట్ చేయించడట. అంటే ప్రభాస్ తన మూడు భారీ బడ్జెట్ సినిమాల కోసం ఫుల్ గా కష్టపడతాడట.

Advertisement
CJ Advs

అంటే నాగ్ అశ్విన్ ని వెయిట్ చేయించకుండా.. ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ ని వెయిట్ చేయించకుండా ఒకేసారి పారలాల్ గా నాగ్ అశ్విన్ అండ్ ఆదిపురుష్ సినిమాలను ప్రభాస్ చేయబోతున్నాడనే న్యూస్ ఫాన్స్ కి పూనకాలు తెప్పించేస్తుంది. ఎప్పుడూ ఆరమ్స్ గా సినిమాలు చేసే ప్రభాస్ ఇప్పుడు మాత్రం వరస సినిమాలు చెయ్యడం.. అందులోనూ ఒకేసారి సినిమాలు చెయ్యడం మాములు విషయం కాదు.. కానీ ప్రభాస్ ముందే ఫిక్స్ అయ్యి.. ఇలా వరస సినిమాలు కమిట్ అయ్యాడట. ముందు జనవరి 2021 లో ఆదిపురుష్ సినిమా షూటింగ్ మొదలు పెట్టి.. ఒక షెడ్యూల్ పూర్తి చేసాక నాగ్ అశ్విన్ తో మరో మూవీని సెట్స్ మీదకి తీసుకెళ్తాడట ప్రభాస్. ఇక నాగ్ అశ్విన్ - ఓం రౌత్ సినిమాలను ప్రభాస్ కొంచెం అటు ఇటుగా పూర్తి చేస్తాడని.. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సలార్ సెట్స్ లోకి ప్రభాస్ అడుగుపెడతాని తెలుస్తుంది.

Prabhas to shoot for Adipurush and Nag Ashwin's new project simultaneously!:

Prabhas latest Movie Updates
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs