Advertisement
Google Ads BL

అనసూయని వదిలేసి శ్రీముఖిని తగులుకున్నాడు!


జబర్దస్త్ షో కే గ్లామర్ తెచ్చిన భామ అనసూయ. అనసూయ అందం, అభినయం, గ్లామర్ అన్ని జబర్దస్త్ షో కి ఎక్స్ట్రా ఎట్రాక్షన్స్. అనసూయ వచ్చాకే యాంకర్స్ ప్రపంచానికి కి గ్లామర్ ని పరిచయం చేసింది. పెళ్లియినా, పిల్లలు పుట్టినా అనసూయ హాట్ గా కనిపించింది అంటే చాలు యూత్ ఆమె పెళ్ళి, పిల్లలు గురించి మారిపోతారు. అలాంటి అనసూయ కేవలం జబర్దస్త్ నే కాదు.. జీ ఛానల్, జెమిని ఛానల్, మా టీవీలోనూ స్పెషల్ షోస్ ని ఊపేస్తోంది. అయితే జీ ఛానల్ లో గతంలో ప్రసారమైన ఓ షో లో డాన్స్ మాస్టర్ జానీ - అనసూయ జేడ్జ్ లుగా వ్యవహరించేవారు. వారు ఇద్దరూ కలిసి హాట్ హాట్ స్టెప్స్ తో స్టేజ్ ని అల్లాడించేవారు. జానీ మాస్టర్ అనసూయ తో కలిసి రొమాంటిక్ గా రెచ్చిపోయి డాన్స్ స్టెప్స్ తో ఇరగదీసేవాడు. వారి స్టేజ్ రొమాన్స్ అదిరిపోయేది.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు జానీ మాస్టర్ అనసూయని వదిలేసి శ్రీముఖితో స్టెప్స్ వేస్తున్నాడు. అదిరింది షో డల్ అవడంతో రంగం లోకి శ్రీముఖిని దింపి.. బొమ్మ అదిరిందిగా మార్చి.. ఆ షో కి క్రేజ్ తేవాలని చూస్తున్నారు నిర్వాహకులు. అందులో భాగంగా శ్రీముఖి స్టేజ్ మీద వేసే డాన్స్ స్టెప్స్ ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి. అయితే అదిరింది స్టేజ్ మీద జానీ మాస్టర్ - శ్రీముఖిల రొమాంటిక్ డాన్స్ ప్రోమో ఇప్పుడు యూ ట్యూబ్ ని హీటెక్కిస్తోంది.  గుండెల్లో ఏముందో పెదువుల్లో తెలుస్తోంది సాంగ్ కి శ్రీముఖి - జానీ కలిసి వేసిన రొమాంటిక్ డాన్స్ మాములుగా లేదు. వీరిద్దరూ రొమాంటిక్ గా రెచ్చిపోయి అదరగొట్టేసారు. మరి ఒకప్పుడు అనసూయతో స్టేజ్ ని ఊపేసిన జానీ.. ఇప్పుడు శ్రీముఖితో కలసి రచ్చ చేస్తున్నాడు.

Leaving Anasuya, Clinging to Srimukhi!:

Jani master used to shake a leg with Anasuya but now he dancing with Srimukhi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs