Advertisement
Google Ads BL

ఇలా అయితే పెళ్లి ఊసేమెత్తుతాడు!!


ప్రభాస్ ప్రభాస్ ఇదే ఇపుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న పేరు. కారణం ప్రభాస్ వరస ఫ్యాన్ ఇండియా మూవీస్ లిస్ట్. రాధేశ్యాం షూటింగ్ చివరిలో ఉండగా.. ప్రభాస్ నాగ్ అశ్విన్ తో భారీ బడ్జెట్ చిత్రాన్ని, ఓం రౌత్ తో ఆదిపురుష్ ని, ప్రశాంత్ నీల్ సలార్ ఫ్యాన్ ఇండియా మూవీస్ ప్రకటించాడు. మరి బాహుబలి తర్వాత పెళ్లి అనుకుంటే ప్రభాస్ బాహబలితో ఐదేళ్లు వృధా చేసాడు. కనీసం అప్పుడయినా పెద్దలకు, ఫాన్స్ కి పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెబుతాడనుకుంటే.. అదీ లేదు. మళ్ళీ సాహో అన్నాడు. దానికి రెండేళ్లు పట్టేసింది. సాహో తర్వాత ప్రభాస్ ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడని అనుకుంటే.. మళ్ళీ రాధాకృష్ణ తో రాధేశ్యాం చేస్తున్నాడు. అప్పుడే ఏడాదిన్నర కావొస్తుంది. కరోనా తో ఆ సినిమా షూటింగ్ అవ్వలేదు. ప్రభాస్ పెళ్లి కుదరలేదు.

Advertisement
CJ Advs

పెద్దలకి, ఫాన్స్ కి ప్రభాస్.. పెళ్లి విషయంలో పరీక్షా పెడుతూనే ఉన్నాడు. రాధేశ్యాం తర్వాత అయినా రానా మాదిరిసైలెంట్ గా పెళ్లి పీటలెక్కుతాడనుకున్న ఫాన్స్ కి ప్రభాస్ వరసగా షాకులు ఇస్తూనే ఉన్నాడు. పెళ్లి విషయం పక్కబెట్టాడో.. మరిచిపోయాడో కానీ.. ప్రభాస్ నాగ్ అశ్విన్, ఆదిపురుష్, కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ సినిమాలు పూర్తయ్యేవరకు పెళ్లి చేసుకోవాలని ఆసక్తి కూడా ఉండదేమో.. పెళ్లి చేసుకుని హీరోలంతా సెటిల్ అయ్యి కూల్ గా సినిమాలు చేసుకుంటుంటే ప్రభాస్ మాత్రం కేవలం సినిమాలతోనే బ్రతికేస్తున్నాడు. రానా, నితిన్, నిఖిల్ ఇలా చాలామంది హీరోలు లాక్ డౌన్ లో పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. కానీ ప్రభాస్.. మరీ పెళ్లి ఊసెత్తకుండా సినిమాలు ప్రకటిస్తూ అటు ఫాన్స్ కి ఇటు పెద్దలకి టెంక్షన్ పెడుతూనే ఉన్నాడు.

These many movies he is making but what about getting married:

Prabhas has a list of movies but marriage plans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs