తెలంగాణలో ఈసారి గ్రేటర్ ఎన్నికలు పెద్ద రణరంగాన్ని తలపించాయి. మా పార్టీకి 100 సీట్లఅంటే మా పార్టీకి 100 సీట్లు అంటూ టీఆరెస్, బిజెపి జబ్బలు చరుచుకున్నాయి. ఈ ఎన్నికల కోసం నువ్వా - నేనా అన్నట్టుగా పోటాపోటీగా టీఆరెస్, బిజెపి, ఎంఐఎం లు పోటీ పడ్డాయి. ఈ ఎన్నికల్లో గెలవడం కోసం మాటల తూటాలు, భారీ డైలాగ్స్ కాకపుట్టించాయి. కేటీఆర్, కేసీఆర్ లు రంగంలోకి దిగి టీఆరెస్ ని గెలిపించడానికి కష్టాలు పడితే.. ఎంఐఎం కోసం అసదుద్దీన్ ఒవైసి కంకణం కట్టుకున్నాడు. బిజెపి అయితే ఏకంగా ఢిల్లీ పెద్దలని రంగంలోకి దింపింది. అమిత్ షా దగ్గరనుండి ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాధ్ లను ప్రచారానికి వాడేసింది.
ఇక తాజాగా ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాలేదు. అంటే 150 స్థానాలకు గాను.. 76 స్థానాలు జైలుచుకున్న వారికీ మ్యాజిక్ ఫిగర్ వస్తుంది. వారే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటారు. కానీ ఇక్కడ టిఆర్ఎస్ అతి పెద్ద పార్టీగా అవతరించగా. రెండో అతిపెద్ద పార్టీగా బిజెపి అవతరించింది. ఇక ఎన్నడూ గెలుచుకోలేనని స్థానాలను ఎంఐఎం గెలుచుకుంది. టిఆర్ఎస్ 56 స్థానాలను కైవసం చేసుకోగా.. బిజెపి 47 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక ఎంఐఎం అయితే 43 స్థానాలు గెలుచుకుని మేయర్ పీఠానికి కీలకంగా మారింది. ఇప్పడు టీఆరెస్ ఎంఐఎం కలిసి మేయర్ పీఠాన్నిపంచుకునేలా ఉంది. ఎందుకంటే ఇక్కడ టీఆరెస్ ఎంఐఎం లు కలిసి ఉంటున్నాయి. మరోపక్క రెండు సీట్లకి కాంగ్రెస్ పరిమితం కావడంతో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినందుకు గాను బాధ్యత వహిస్తూ టి కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసారు.