ప్రభాస్ మూవీస్ లిస్ట్ చూస్తే ఫాన్స్ కి పూనకాలే.. కానీ మిగతా హీరోలకి దిమ్మ తిరుగుతుంది. అలా వరస సినిమాలతో ప్రభాస్ మిగతా హీరోల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. వరస ఫ్యాన్ ఇండియా మూవీస్ తో ప్రభాస్ పరుగులు పెడుతున్నాడు. తాజాగా కన్నడ కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్ మూవీ ప్రకటించి షాకిచ్చాడు ప్రభాస్. కానీ కన్నడీగులు ప్రశాంత్ నీల్ ని ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ కెజిఎఫ్ తో హిట్ కొట్టిన ప్రశాంత్ ని కన్నడ ని మర్చిపోయి టాలీవుడ్ హీరోల వెంట పడుతున్నాడని ట్రోల్ చేస్తున్నారు. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం తన కథకు కన్నడ నటులు సరిపోరని చెబుతున్నాడు. అంటే సలార్ సినిమాలో కన్నడ నటులు పెద్దగా కనిపించరట.
మరి మాస్ కథకి ఏ హీరోయిన్ అయినా ఓకె కదా అంటే.. తన కథకు ప్రభాస్ మాత్రమే ఎందుకు సరిపోతాడంటే.. తాను రాసుకున్న కథకు అమాయకపు మొహం, అలాగే డీసెంట్ లుక్స్ ఉన్న స్టార్ హీరో మాత్రమే సరిపోతాడని చెప్పిన ప్రశాంత్ నీల్ ఆ లక్షణాలు కేవలం ప్రభాస్ కి మాత్రమే ఉన్నాయంటున్నాడు. ప్రభాస్ అమాయకపు ఫేస్, ప్రభాస్ లుక్స్ అన్ని తన కథ పెర్ఫక్ట్ గా సూట్ అవుతాయని.. ఈ కథలో హీరో అమాయకంగా ఉంటూ డాన్ లా కరుడుగట్టిన నాయకుడిగా ఎలా ఎదిగాడనేది తన సినిమాలో చూపించబోతున్నా అని.. అందుకే ప్రభాస్ ని హీరోగా ఎంపిక చేసుకున్నట్టుగా ప్రశాంత్ నీల్ తనపై వస్తున్న ట్రోల్స్ కి వివరణ ఇచ్చాడు.