Advertisement
Google Ads BL

సర్కారు వారి పాటలో పవన్ కూడా..?


ఇప్పుడు టాలీవుడ్ లో మల్టీస్టారర్స్ హవా నడుస్తుంది. చిరంజీవి సినిమాలో చరణ్ నటిస్తున్న ఆచార్యపై ట్రేడ్ లోనే కాదు.. ప్రేక్షకుల్లోనూ బోలెడన్ని అంచనాలున్నాయి. గతంలో స్టార్ హీరోస్ వెంకటేష్ - మహేష్ కలయికలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సూపర్ హిట్. ఇక వెంకటేష్ - పవన్ కలయికలో గోపాల గోపాలా, వరుణ్ - వెంకీ కాంబోలో F2 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో హీరోల చూస మల్టీస్టారర్స్ పై పడింది. తాజాగా మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే టాక్ టాలీవుడ్ ని ఊపేస్తోంది. వరస సినిమాలతో ఖాళీ లేని పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు కలిసి ఒకే సినిమాలో.. అబ్బబ్బ వినడానికే ఫాన్స్ కి పూనకలొచ్చేస్తున్నాయి. మహేష్ ఫాన్స్, పవన్ ఫాన్స్ ఎగ్జైట్మెంట్ తో ఊగిపోతున్నారు.

Advertisement
CJ Advs

అయితే పవన్ నటించబోయేది మహేష్ తాజా చిత్రం సర్కారు వారి పాటే అంటున్నారు. మహేష్ సర్కారు వారి పాటను దర్శకుడు పరశురామ్ బ్యాంక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడు. బ్యాంక్ లను మోసం చేసి విదేశాలకు పారిపోతున్న బడా బాబుల భాగోతాలను ఈ సినిమా ద్వారా చూపించబోతున్నాడనే టాక్ ఉంది. ఈ సినిమాలో పవన్ ఓ కీలక పాత్రని అది ఐదు నిమిషాల పాత్రని మహేష్ కోసం చేయబోతున్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. సర్కారు వారి పాటలో గెస్ట్ పాత్రే అయినా కథను మలుపు తిప్పే పాత్రలో పవన్ కనిపిస్తాడని టాక్ మాత్రం సోషల్ మీడియాని ఊపేస్తోంది. నిజంగా పవన్ గనక మహేష్ సర్కారు వారి పాటలో భాగమైతే ఆ సినిమా అంచనాలను తాకడం కూడా ఎవ్వరి వల్లా కాదు. 

Pawan Kalyan also to be a part of Sarkaru Vari Pata:

Pawan Guest role in Mahesh - Parasuram Sarkaru vari pata 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs