రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అంటే అమ్మాయిలకే కాదు.. ఇప్పుడు అబ్బాయిలకు క్రష్ వచ్చేసింది. కారణం సినిమాలు ఒకటి అయితే.. మరొకటి రౌడీ బ్రాండ్ దుస్తులు. పూరి దర్శకవుల్లో ఫైటర్ పాన్ ఇండియా మూవీ చేస్తున్న విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్స్ కి పుష్ప తో పాన్ ఇండియాలోకి అడుగుపెడుతున్న అల్లు అర్జున్ ఎప్పుడో పడిపోయాడు. విజయ్ దేవరకొండ లేటెస్ట్ డ్రెస్సింగ్ స్టయిల్ కి యూత్ మొత్తం ఫిదా. ఆఖరికి అల్లు అర్జున్ కూడా ఫిదా అయ్యాడు. రౌడీ బ్రాండ్స్ స్టైలింగ్ డ్రెస్సులంటే ఇష్టమని అల్లు అర్జున్ అడిగాడో లేదో.. రౌడీ బ్రాండ్ దుస్తులు పంపి సర్ప్రైజ్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ.
తాజాగా అల్లు అర్జున్ కి విజయ్ దేవరకొండ ఓ కొత్త స్టైలిష్ రౌడీ బ్రాండ్ దుస్తులని పంపించాడు. ఆ డ్రెస్ నచ్చిన అల్లు అర్జున్.. ఇలాంటి అందమైన, సౌకర్యంగా ఉన్న స్టైలిష్ డ్రెస్ పంపించినందుకు నా బ్రదర్ విజయ్ దేవరకొండ కి థాంక్స్ చెప్పడమే కాదు.. రౌడీ టీం కి ధన్యవాదాలు కూడా చెప్పాడు. నాపై నువ్వు చూపిస్తున్న ప్రేమకి కృతఙ్ఞతలు బ్రదర్ .. నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలి అంటూ అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ ని ఎత్తేస్తున్నాడు. మరి స్టైలిష్ గా ఉండే అల్లు అర్జున్ నే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన లేటెస్ట్ బ్రాండ్స్ తో పడేసాడంటే మాములు విషయం కాదు కదా..!