Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ కి కథ నచ్చలేదా?


కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా ఉండబోతుంది అని ప్రచారం మాములుగా జరగలేదు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాని మైత్రి మూవీస్ నిర్మించబోతోంది అని, ఎన్టీఆర్ కి ప్రశాంత్ నీల్ బర్త్ డే విషెస్ చెప్పడం, ప్రశాంత్ నీల్ కి ఎన్టీఆర్, మైత్రి మూవీస్ వారు విషెస్ చెప్పడం, ఎన్టీఆర్ ని ప్రశాంత్ నీల్ టైగర్ అనడంతో వాళ్ళ కాంబోలో మూవీ పక్కా అని ఎన్టీఆర్ ఫాన్స్ ఫిక్స్ అయ్యారు. ఇక ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మధ్యన కథ చర్చలు, లంచ్ పార్టీ కూడా జరిగినట్లుగా సోషల్ మీడియా కోడై కోసింది. కానీ తర్వాత ఎందుకో ప్రభాస్ లైన్ లోకి వచ్చాడు. ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ లో టచ్ లో ఉన్నాడనే న్యూస్ నడుస్తుండగానే.. ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబో సలార్ పాన్ ఇండియా మూవీ ప్రకటన వచ్చి ఎన్టీఆర్ ఫాన్స్ కి షాకిచ్చింది.

Advertisement
CJ Advs

ప్రభాస్ తో మాస్ మూవీ సాలార్ ని పాన్ ఇండియా లెవల్లో కెజిఎఫ్ నిర్మాతలు భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. అయితే ఎన్టీఆర్ కి ప్రశాంత్ నీల్ సలార్ కథ చెప్పినప్పటికీ.. ఎన్టీఆర్ కి కథ నచ్చకపోవడంతో అది హోల్డ్ లో ఉంచాడని, ప్రశాంత్ నీల్ అదే కథ తో ప్రభాస్ చేత కమిట్ చేయించాడని ఇపుడు ఇండస్ట్రీలో హాట్ హాట్ గా చక్కర్లు కొడుతున్న న్యూస్. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కి కథ చెప్పగా.. ఇంకా డెవెలెప్ చెయ్యమని, అందులో మార్పులు చెయ్యమని చెప్పాడని.. కానీ తన కథ మీదున్న నమ్మకంతో ప్రభాస్ కి కథ వినిపించి ప్రశాంత్ నీల్ ఓకె చేయించుకున్నాడనే టాక్ మొదలైంది. మరి నాగ్ అశ్విన్, ఆదిపురుష్ సినిమాలు అయ్యేవరకు ప్రశాంత్ నీల్ ప్రభాస్ కోసమే వెయిట్ చేస్తాడో లేదంటే.. ఈలోపు ఎన్టీఆర్ తో వర్కౌట్ అయితే ఆయనతో సినిమా మొదలు పెడతాడో అనేది ఇపుడు అందరిలో క్యూరియాసిటీతో మెదులుతున్న ప్రశ్న.

NTR not showing interest in Prashanth Neel script?:

Prashanth neel - Prabhas combo Salaam Announcement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs