తెలంగాణ సీఎం థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వగానే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటరు సినిమాని డిసెంబర్ 25 క్రిస్మస్ న విడుదల చేస్తున్నామంటూ కరోనా తర్వాత మొదటి సారిగా విడుదల డేట్ లాక్ చేసాడు. అంటే సాయి ధరమ్ తేజ్ మొట్టమొదట ధైర్యం చేసిన హీరో. మరి లాక్ డౌన్ ముందు రిలీజ్ డేట్స్ ఇచ్చి.. థియేటర్స్ మూతబడడంతో కామ్ అయిన ఉప్పెన వైష్ణవ తేజ్ కానీ, ప్రదీప్ మాచిరాజ్ 30 రోజులో ప్రేమించడం ఎలా సినిమాలు థియేటర్స్ ఓపెన్ అయినా ఇంకా సైలెంట్ గానే ఉన్నారు.
కనీసం మా సినిమా ఇప్పుడు అని కానీ, సంక్రాంతికి అని కానీ విడుదల డేట్స్ ఇవ్వకుండా నాన్చుతునే ఉన్నారు. ఓటిటి నుండి ఎన్ని ఆఫర్స్ వచ్చినా ప్రదీప్ నిర్మాతలు ఒప్పుకోలేవు. ఇక ఉప్పెన వైష్ణవ తేజ్ అయితే ఫస్ట్ సినిమా ఓటిటి ఇవ్వను థియేటర్స్ లోనే ఉప్పెన అన్నోడు థియేటర్స్ ఓపెన్ అయినా.. కామ్ గా ఉండడంతో ప్రేక్షకులకే అర్ధం కావడం లేదు. మరి వైష్ణవ ఏజ్ కానీ, ప్రదీప్ కానీ సినిమా పోస్టర్స్ కూడా ఇవ్వకుండా ఇంకా సస్పెన్స్ లోనే పెడుతున్నారు. అందరూ థియేటర్స్ ఓపెన్ అయినా వాళ్లిద్దరూ ఎక్కడ అంటున్నారు. మరి డెబ్యూ హీరోలకి కరోనా మాములుగా పరీక్ష పెట్టలేదు.. ఘోరమైన పరిక్షే పెట్టింది.