Advertisement
Google Ads BL

స్టార్స్ కి బాధ్యత లేదా?


తాజాగా జరిగిన హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో స్టార్స్ హడావిడి చాలా తక్కువగా కనబడింది. చిరు, నాగార్జున, విజయ్ దేవరకొండ, లక్ష్మి మంచు, రామ్ పోతినేని, బెల్లకొండ లాంటి స్టార్స్ తప్ప  మిగతా స్టార్స్ ఎవరూ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వెయ్యడానికి రాలేదు. కరోనాకి భయపడొద్దు.. ఓటు హక్కు వినియోగించుకోండి అని విజయ్ దేవరకొండ లాంటి హీరో చెప్పినా హైదరాబాద్ జనాలు నిద్రావస్థలోనే ఉన్నారు కానీ.. ఓటు వెయ్యడానికి రాలేదు. ఇక యంగ్ హీరోస్ లో అందులోను స్టార్ హీరోస్ లో ఎవరూ ఓటు వెయ్యలేదు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్, రామ్ చరణ్ ఇలా ఎవరూ తమ ఓటు వినియోగించుకోలేదు. ఎన్టీఆర్ ఎప్పుడూ ఫ్యామిలీతో కలిసి ఓబుల్ రెడ్డి స్కూల్ లో ఓటు వేసేవాడు. కానీ ఈ గ్రేటర్ ఎన్నికలని ఎన్టీఆర్ లైట్ తీసుకున్నాడనిపిస్తుంది.

Advertisement
CJ Advs

ఇక అల్లు అర్జున్ కూడా తన ఫ్యామిలీతో కలిసి ఓటేసేవాడు. అల్లు స్నేహ తప్ప అల్లు అర్జున్ కానీ అరవింద్ ఫ్యామిలీ కానీ ఓటేయ్యలేదు. ఇక రామ్ చరణ్ కూడా ఎన్నికల్లో కనబడలేదు. కారణం నిహారిక పెళ్లి కోసం రామ్ చరణ్, వరుణ్ అండ్ నాగబాబు వాళ్ళు రాజస్థాన్ కి వెళ్లడంతో ఈ ఎలక్షన్స్ మిస్ అయ్యారని అంటున్నారు. మరోపక్క రాజమౌళి ఓటెయ్యండి అంటూ ప్రచారం చేసేవాడు. మరి రాజమౌళి కూడా హ్యాండ్ ఇచ్చేసాడు. ఓటు హక్కు వినియోంచుకుని సెల్ఫీలతో సందడి చేసే స్టార్స్ ఇప్పుడు సైలెంట్ గా ఉండిపోయారు. ఇక ప్రభాస్ ముంబైలో ఉన్నాడనుకుంటే.. మహేష్ హైదరాబాద్ లోనే ఉన్నాడు. కానీ ఓటు హక్కు వినియోగించుకోలేదు. చిరు భార్యతోను, నాగ్ భార్యతోను కలిసి వచ్చి ఓటెయ్యగా.. విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి ఓటు హక్కు వినియోగించుకుంటే.. చాలామంది సెలబ్రిటీస్ ఇల్లు దాటి బయటికి రాలేదంటే స్టార్స్ కి ఓటు వేయాలనే బాధ్యత లేదా అని ఓటు హక్కు వినియోగించుకున్న నెటిజెన్స్ సూటిగా బాణాలు వదులుతున్నారు.

Star heroes neglected ghmc elections:

GHMC elections.. poor response from tollywood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs