మహేష్ బాబు తో సినిమాలు చెయ్యాలనే కల ప్రతి ఒక్క డైరెక్టర్ కి ఉంటుంది. అందులోనూ స్టార్ డైరెక్టర్స్ కి మరి ఎక్కువ ఉంటుంది. కాకపోతే మహేషే త్వరగా కమిట్ అవ్వడు. ఎంత స్టార్ డైరెక్టర్ అయినా కథ నచ్చకపోతే పక్కన పెట్టేస్తాడు మహేష్. గతంలో పూరి తాజాగా సుకుమార్, వంశి పైడిపల్లి కి ఇలానే అయ్యింది. అయితే ఒకసారి పక్కనబెట్టిన దర్శకుడితో మహేష్ మళ్ళీ సినిమా చెయ్యలేదు. అంటే పూరికి మహేష్ కి మధ్యన కథ తేడా కొట్టిన తర్వాత మహేష్ మళ్ళి పూరి తో సినిమా చెయ్యలేదు. తాజాగా సుకుమార్ కథని రిజెక్ట్ చేసిన మహేష్ బాబు పరశురామ్ తో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.
మరి మహేష్ మహేష్ సర్కారు వారి పాట తర్వాత రాజమౌళి తో సినిమా చెయ్యాల్సి ఉంది. ఆ సినిమా తర్వాత మహేష్ త్రివిక్రమ్ తో సినిమా చేయాలనుకుంటున్న విషయం.. మొన్నామధ్యన సోషల్ మీడియాలో రివీల్ అయ్యింది. త్రివిక్రమ్ తో తన నెక్స్ట్ మూవీ ఉండొచ్చనే హింట్ ఇచ్చాడు. ఇక సుకుమార్ తో క్రియేటివ్ డిఫ్రెన్సెస్ వలన సినిమా ఆపేసినట్లుగా ట్వీట్ చేసిన మహేష్.. మళ్ళీ చాలా రోజులకి సుకుమర్ తో మహేష్ టచ్ లోకి వచ్చాడంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. దానితో సుక్కు - మహేష్ కాంబో లో మూవీ త్వరలోనే ఉండొచ్చనే ఊహాగానాలకు తెర లేచింది. మహేష్ కి తన కథ నచ్చక సినిమా ఆపేసినా.. సుకుమార్ మాత్రం లాక్ డౌన్ టైమ్ లో ఖాళీగా ఉండడమెందుకు అని మహేష్ కోసం ఓ లైన్ రెడీ చేసి పెట్టుకున్నాడట. ఆ స్టోరీ లైన్ తో సుక్కు మహేష్ ని ఇంప్రెస్స్ చేసాడనే న్యూస్ నడుస్తుంది.
పుష్ప తర్వాత విజయ్ దేవరకొండ తో సినిమా కమిట్ అయిన సుక్కు తన తదుపరి చిత్రానికి మహేష్ ని లైన్ లోకి తేబోతున్నాడనే టాక్ మొదలయ్యింది. కానీ మహేష్ మాత్రం రాజమౌళి, త్రివిక్రమ్ ల సినిమాలు అయ్యాకే సుక్కుతో సినిమా అంటాడేమో.. అలా అయినా ఈలోపు సుకుమార్ కూడా పుష్ప, విజయ్ సినిమాలు పూర్తి చేసేస్తాడు.