Advertisement
Google Ads BL

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అసలు రంగులు!!


బిగ్ బాస్ సీజన్ 4 మరో రెండు వారాల్లో ముగియబోతుంది. నాగార్జున హోస్టింగ్ లో సక్సెస్ ఫుల్ గా ముగియబోతున్న బిగ్ బాస్ సీజన్ 4 లో మేము స్ట్రాంగ్ అంటే మేము స్ట్రాంగ్ అనుకుంటున్నారు అందరూ. అవినాష్ అయితే జస్ట్ ఎలిమినేట్ అవ్వబోయి.. తప్పించుకున్నాడు. లేదంటే అవినాష్ బయట ఛానల్స్ లో కూర్చుని ఇంటర్వూస్ ఇచ్చుకునేవాడు. ఇక మోనాల్ గత రెండు వారాల క్రితం వరకు సరిగా ఆడకుండా గ్లామర్ తోనూ, అఖిల్ ట్రాక్ తో నెట్టేసింది. కానీ ఇప్పుడు బాగా ఆడేస్తుందన్న కారణంతో హౌస్ లో కొనసాగుతుంది. ఇక అభిజిత్ కి టాస్క్ పెరఫార్మెన్స్ తక్కువ బిల్డప్ ఎక్కువ. 

Advertisement
CJ Advs

హారిక గట్టిగా పోరాడుతుంది కానీ.. అభిజిత్ విషయంలో వీకైపోతుంది. ఇక అరియనా అరుపులు.. కానీ ఫెయిర్ గేమ్. సోహైల్ అయితే అందరిని మడతెట్టేస్తాడు. తాజాగా ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో హౌస్ మేట్స్ అసలు రంగులు బయటికొచ్చాయి. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో రంగు నింపి కారణం చెప్పి ఇంటి సబ్యులని నామినేట్ చెయ్యాలి. అందులో హారిక అభిజిత్ ని నామినేట్ చేసి షాకిచ్చింది. నాగార్జున క్లాస్ కి హారిక అభిజిత్ కి బొమ్మ చూపించింది. అంతేనా మోనాల్ అఖిల్ ని నామినేట్ చేసి షాకివ్వగా.. అఖిల్ నన్ను బ్యాడ్ చేస్తున్నావ్ అంటూ మోనాల్ తో గొడవ సార్ట్ చేసాడు. 

అరియనా - మోనాల్ గొడవకి అవినాష్ ఆజ్యం పోసాడు. అలాగే అవినాష్ నేను స్ట్రాంగ్ అంటున్న అఖిల్ కి కౌంటర్ వేసాడు. నేను స్ట్రాంగ్ గా ఉన్నాను.. నాకన్నా వీక్ ఉన్న వాళ్ళు హౌస్ లో ఎలా ఉంటారంటూ అవినాష్ రాష్ అయ్యాడు. అభిజిత్ అయితే హారిక నామినేట్ చేయగానే నువ్వు కూడా అర్ధం చేసుకోకపోతే ఎలా హరిక అంటూ హారికాని ఏడిపించేసాడు.. మరి ఇప్పటివరకు గేమ్ కోసం చాలా దాచేసి గుంభనంగా ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అసలు రంగులు చివరి వారంలో బయటపడుతున్నాయి.

Bigg Boss Contestants Showing Original Colours!:

Bigg Boss coming to an end, heat is rising up
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs