Advertisement
Google Ads BL

రెండుగా చీలిపోయిన జబర్దస్త్!


బిగ్ బాస్ 4 లో అవినాష్ ఈ వారం ఎలిమినేట్ అవ్వాల్సింది.. కానీ ఏవేక్షన్ పాస్ వాడి ఎలిమినేషన్స్ నుండి తప్పిచుకున్నాడు. లేదంటే మనోడికి నిన్నటితో బిగ్ బాస్ తో ఋణం తీరిపోయేది. ఇప్పటివరకు కామెడీ కార్డు, సింపతీ కార్డు వాడి.. బిగ్ బాస్ లో కొనసాగుతున్న అవినాష్ కి ఆయన మాజీ షో జబర్దస్ నుండి మంచి మద్దతే లభించింది. అవినాష్ కి సపోర్ట్ చేస్తూ రాకింగ్ రాకేష్, గెటప్ శ్రీనులు అవినాష్ కే ఓటెయ్యండి, అవినాష్ ని గెలిపించండి అని పోస్ట్ లు పెడుతూ అవినాష్ కి మద్దతు తెలిపారు.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు అదే జబర్దస్త్ కమెడియన్స్ ఒకపక్క అవినాష్ కి మద్దుతు తెలుపుతూనే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో ఇప్పటివరకు స్టేబుల్ గా ఆడుతున్న అభిజిత్ కి కూడా మద్దతు తెలుపుతున్నారు. అభిజిత్ విన్నర్ అవ్వాలంటూ జబర్దస్త్ కమెడియన్స్ కొంతమంది అభిజిత్ కే మద్దతు తెలుపుతున్నారు. జబర్దస్త్ టీం లీడర్ భాస్కర్ అవినాష్ గెలిస్తే బావుంటుంది అని చెబుతూనే.. అభిజిత్ బిగ్ బాస్ గేమ్ బాగా ఆడుతున్నాడని.. అందుకే అభిజిత్ కి ఓటేసి గెలిపించమని కోరుతున్నారు. కేవలం భాస్కర్ మాత్రమే కాదు.. జబర్దస్త్ లోని కొంతమంది కమెడియన్స్ కూడా అభిజిత్ కి సపోర్ట్ చేస్తున్నారు. అవినాష్ విన్నర్ అయ్యే ఛాన్స్ లేదని కొంతమంది కమెడియన్స్ కామెంట్ చెయ్యడం ఇప్పడు సంచలనంగా మారింది.

ఆఖరుకి నాగబాబు కూడా అవినాష్ ని వదిలేసి అభిజిత్ ని సపోర్ట్ చెయ్యడం చూస్తే జబర్దస్త్, బిగ్ బాస్ కోసం రెండుగా చీలిపోయినట్లుగా అనిపిస్తుంది. మరి అవినాష్ కి మా సపోర్ట్ ఉంటుంది అని చెబుతూనే అభిజిత్ కి ఓట్స్ వెయ్యండి గెలిపించండి అంటే ఏమనుకోవాలి.. మరోపక్క రాకేష్, శ్రీను లాంటి వాళ్ళు అవినాష్ కి సపోర్ట్ చేసినా.. జబర్దస్త్ లో మేజర్ కమెడియన్స్ మాత్రం అభిజిత్ కి సపోర్ట్ చెయ్యడం చూస్తే జబర్దస్త్ బ్యాచ్ మొత్తం రెండుగా చీలిపోయినట్లే కనబడుతుంది.

Jabardasth split into two in that regard!:

Bigg boss 4: Some of the Jabardasth teams not supporting Avinash
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs