Advertisement
Google Ads BL

నాగ్ చేసింది ముమ్మాటికీ తప్పే!


స్టార్ మా టీఆర్పీ పెంచడం కోసం నాగార్జున చాలానే చేస్తున్నాడు. వారం వారం ఎవరో ఒక సెలెబ్రిటీ ని తీసుకొచ్చి బిగ్ బాస్ స్టేజ్ మీద తనతో పాటుగా నుంచోబెట్టి వాళ్లతో హౌస్ మేట్స్ ని ఆట పట్టిస్తున్నాడు. తాజాగా ఈ ఆదివారం నాగార్జున కన్నడ బిగ్ బాస్ హోస్ట్ కిచ్చ సుదీప్ ని తీసుకోచ్చాడు. సుదీప్ బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో ఫన్నీ క్వచ్చన్స్ తో ఏడిపించాడు. ఇక నాగార్జున ఈ వారం అఖిల్ ని సేవ్ చేసి అరియనా - అవినాష్ ని ఎలిమినేషన్స్ జోన్ లో నుంచోబెట్టి.. అవినాష్ ఎవిక్షన్ కార్డు వాడేలా చేసి అవినాష్ ఎలిమినేట్ కాకుండా కాపాడాడు. అయితే నాగార్జున శనివారం ఎపిసోడ్ లో హారికాని పాయింట్ అవుట్ చేస్తూ అభిజిత్ కోసం నువ్వు ఆటాడకు.. నీకు నువ్వు ఆడు.. నువ్వు ఏం చేసినా అభిజిత్ కోసమే చేసావ్ అంటూ హరికకి క్లాస్ ఇచ్చాడు. దానితో హారిక కన్నీటి పర్యంతమైంది. 

Advertisement
CJ Advs

ఇక అభిజిత్ విషయంలో ఫైర్ అయిన నాగ్ కి ఆభిజీత్ ఫాన్స్ చుక్కలు చూపెట్టారు. తాజాగా మోనాల్ - అఖిల్ కి ఓ న్యాయం..  హరిక - అభి కి ఓ న్యాయమా..  అంటూ నాగ్ ని హారిక - అభిజిత్ ఫాన్స్ ఆడుకుంటున్నారు. అఖిల్ - మోనాల్ లు ఎప్పుడు చూసినా జంటగా కూర్చుంటారు. జంటగా ఆడతారు.. మోనాల్, అఖిల్ కోసం చెయ్యని త్యాగమే లేదు.. అలాంటిది నాగార్జున వాళ్ళిద్దరిని వదిలేసి.. హారికాని పిలిచి తిట్టడం ఏం బాగోలేదని.. అభిజిత్ విషయంలో హరిక పాజిటివ్ గా ఉండడం చూసిన నాగ్ క్లాస్ పీకాల్సిన అవసరం ఏమిటి అంటూ నాగార్జున ని యేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో అభిజిత్ ఫాన్స్ అయితే నాగ్ ని ట్రోల్ చేస్తున్నారు కూడా. మరి నాగార్జున అఖిల్ - మోనాల్ విషయంలో సైలెంట్ గా ఉండి.. హారిక - అభిజిత్ విషయంలో అలా ఫైర్ అవడం ముమ్మాటికీ తప్పే అంటూ అభిజిత్ - హారిక ఫాన్స్ నాగ్ ని తప్పుబడుతున్నారు.

Bigg boss 4: Nag is absolutely wrong in dealing Harika's matter:

Aren't Monal - Akhil also playing like Abhijeet and Harika
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs