Advertisement
Google Ads BL

RRR షూటింగ్ కి బ్రేకివ్వబోతున్న చరణ్?


రామ్ చరణ్ - ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న RRR సినిమా షూటింగ్ ని రాజమౌళి రాత్రీపగలూ చిత్రీకరిస్తున్నాడు. కరోనా తో టైం వెస్ట్ అవడంతో రాజమౌళి ఇప్పుడు షూటింగ్ కి బ్రేక్ లేకుండా తాను కష్టపడడమే కాదు.. అందరిని కష్టపెడుతున్నాడు కూడా. అయితే ఎన్టీఆర్ కాంబో సీన్స్ లేకపోవడంతో ఎన్టీఆర్ ఈమధ్యనే తన భార్య పిల్లలతో చిన్నపాటి వెకేషన్ ప్లాన్ చేసుకుని దుబాయ్ ట్రిప్ వేసాడు. కానీ రామ్ చరణ్ మాత్రం RRR షూటింగ్ కి హాజరవుతున్నాడు. RRR షూటింగ్ ఎంత త్వరగా ఫినిష్ అయితే అంత త్వరగా రామ్ చరణ్ చిరు ఆచార్య షూటింగ్ కి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది.

Advertisement
CJ Advs

అంత బిజీ షెడ్యూల్ టైమ్ లో రామ్ చరణ్ ఇప్పుడు RRR షూటింగుకి బ్రేకివ్వబోతున్నాడనే న్యూస్ నడుస్తుంది. చరణ్ ఇప్పటికే రాజమౌళి దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నాడట. ఇంతకీ అంత అర్జెంటు గా చరణ్ RRR షూట్ కి ఎందుకు బ్రేకివ్వాల్సి వస్తుంది అంటే.. చరణ్ బాబాయ్ కూతురు నీహారిక పెళ్లి డిసెంబర్ 9 న రాజస్థాన్ లోని ఉదయ్ ప్యాలెస్ లో జరగబోతుంది. అందుకు గాను రామ్ చరణ్ ఓ నాలుగు రోజుల పాటు RRR షూటింగ్ నుండి బ్రేక్ తీసుకోబోతున్నాడట. నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి కి రామ్ చరణ్ ఓ నాలుగు రోజుల ముందే రాజస్తానికి వెళ్ళబోతున్నాడట. నిహారిక సంగీత్, మెహిందీ వేడులతో పాటుగా పెళ్లి కూతురు ఫంక్షన్, అలాగే పెళ్లి కి రామ్ చరణ్ హాజరవుతాడని తెలుస్తుంది. 

Ram Charan to give a break to RRR shooting?:

Ram Charan attend Niharika's Wedding and takes a break
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs