Advertisement
Google Ads BL

బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ కష్టాలు!


బిగ్ బాస్ సీజన్ 4 లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో చాలా కొద్దిమంది మాత్రమే బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం ఉన్న కంటెస్టెంట్స్ ఉన్నారు. అసలు ఎవరికీ పరిచయం లేని కండల వీరుడు మెహబూబ్. అప్పట్లో ఎవరికీ తెలియకపోయినా ఇప్పుడు అందరూ బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ అంటున్నారు. ఫెమ్ లేని మెహబూబ్ మూడు నాలుగు వారాలకే బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అవుతాడనుకుంటే.. పది వారలు హౌస్ లో ఉండి సత్తా చాటాడు. కొన్ని వారలు బిగ్ బాస్ మెహబూబ్ ని సేవ్ చేసాడనే ట్రోల్స్ వచ్చినా మెహబూబ్ తన కండ బలంతో బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ లు గెలిచి నిలబడ్డాడు. అయితే రెండు వారాల ముందు ఎమోషనల్ గా బయటికి వెళ్లిన మెహబూబ్ తాజాగా తాను హౌస్ నుండి బయటికి వచ్చాక రెండు రోజులు ఏమి తినలేదు అని అన్నాడు. కారణం ఒకటి ఎలిమినేట్ కావడం అయితే రెండోది.. తాను నా వాళ్ళు అనుకున్న వాళ్ళే మోసం చేసారని చెబుతున్నాడు.

Advertisement
CJ Advs

పెద్దగా క్రేజ్ లేని తనకు బిగ్ బాస్ హౌస్ లో ఆపర్చునిటీ రావడం మాములు విషయం కాదని, అందుకే తాను హౌస్ లోకి వెళ్లే రెండు రోజుల ముందు తన ఫ్రెండ్స్ లో చాలామందికి ఫోన్ చేసి తనకి ఈ అవకాశం వచ్చింది అని, అందరిని సపోర్ట్ చెయ్యమని అడిగానని చెప్పాడు. కానీ హౌస్ నుండి బయటికొచ్చి చూస్తే ఒక్కళ్ళు తనని సపోర్ట్ చెయ్యలేదని.. కనీసం సోషల్ మీడియాలో ఒక్క ట్వీట్ పెట్టలేదని.. ఇంకా పైగా ఓ మూడు వారాల్లోనే బయటికొచ్చేస్తావ్ అనుకుంటే పది వారాలున్నావ్ అంటూ వెటకారం చేసారంటూ బాధపడుతున్నాడు మెహబూబ్. బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ ఉండదు, నిద్ర ఉండదు.,.. మెంటల్ గా డిస్టర్బ్ అవుతాం, పేరేంట్స్ ఉండరు, మైండ్ గేమ్ ఆడాలి.. కానీ బయట నా అనుకున్న వాళ్ళే నన్ను ఇంత ఘోరంగా మోసం చేసారంటూ ఎమోషనల్ అయ్యాడు మెహబూబ్.

Bigg Boss Fame Mehboob Troubles!:

Mehaboob's Eliminations was a pain but his own friends Betrayal was evenr worse
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs