Advertisement
Google Ads BL

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో విసిగిపోయిన నాగ్!


బిగ్ బాస్ సీజన్ 4 ఆఖరి దశకు చేరుకుంది. శనివారం రాత్రి బిగ్ బాస్ హౌస్ సభ్యులతో నాగార్జున చెడుగుడు ఆడుకున్నాడు. అభిజిత్ ఇంకా హరికలకు నాగ్ ఇచ్చిన క్లాస్ తో.. వారిద్దరూ వణికిపోయారు. హారిక బెస్ట్ కెప్టెన్ కాదని, ఆమె చేసిన తప్పులు ఏమిటో ఆమెతోనే చెప్పించిన నాగార్జున అభిజిత్ కి ఏకంగా తలంటేసాడు. ఇక శనివారం ఎపిసోడ్ లో నామినేషన్స్ లో ఉన్న మోనాల్ ఫస్ట్ సేవ్ అవ్వగా.. అవినాష్ కి బిగ్ బాస్ ఇచ్చిన ఎవిక్షన్ కార్డు వాడతావా.. ఉంచుకుంటావా అని అడిగిన నాగ్ సన్ డే ఎపిసోడ్ కి రాకుండా.. కిచ్చ సుదీప్ ని స్టేజ్ మీదకి పంపి ఇంటి సభ్యులకి ఝలక్ ఇచ్చాడు. 

Advertisement
CJ Advs

సన్ డే ఎపిసోడ్ కి కిచ్చ సుదీప్ గెస్ట్ గా బిగ్ బాస్ స్టేజ్ మీదకి రాగా.. బిగ్ బాస్ సభ్యులంతా నాగ్ సర్ ఏరి అని సుదీప్ ని అడిగితే.. బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో ఆయన విసిగిపోయి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారనగానే హౌస్ మేట్స్ అంతా కేకలుపెట్టేసారు. నాగ్ సర్ అలా చెయ్యరు.. ఆయనకి మేమంటే ఇష్టం అంటూ అరిచేసారు. హి ఈజ్ ద కింగ్, నాగ్ సర్ ఈజ్ ద బెస్ట్ అని అభిజిత్ అనగానే నేను కూడా అగ్రీ అంటూ నాగార్జునని సుదీప్ స్టేజ్ మీదకి ఆహ్వానించాడు. ఇక సుదీప్ బిగ్ బాస్ సభ్యులతో ఓ అట ఆడుకున్నాడు. కన్నడలో మాట్లాడిన సుదీప్ తో సోహైల్ కన్నడలో మాట్లాడబోయి కామెడీ చేసాడు. 

అవినాష్ ని సుదీప్ హౌస్ లో ఉన్న ముగ్గురు అమ్మాయిలతో ఎవరిని పెళ్లి చేసుకుంటావ్, ఎవరిని డేట్ కి తీసుకెళ్తావ్ , ఎవరిని చంపేస్తావ్ అంటూ అవినాష్ ని ఆటపట్టించగా.. దానికి నాగార్జున అవినాష్ పులిహార బాగా కలుపుతాడంటూ ఏడిపించాడు. ఇక అఖిల్ ని లేపి నిన్ను కాదు మోనాల్ ని అనగానే వాళ్ళిద్దరిలో ఎవ్వరైనా ఒక్కటే అని నాగ్ అనగానే ఓ అవునా.. అదేమిటో నాకు వినాలని క్యూరియాసిటీగా ఉంది చెప్పరా అనగానే.. వాళ్ళిద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి.. ఒకే ఆన్సర్ ఉంటుంది అంటూ నాగ్ ఆటపట్టించాడు. ఇక మోనాల్ తెలుగులో కిచ్చ సుదీప్ ని నువ్వు నాకు చాలా ఇష్టం అనగానే చాలా జెన్యూన్ ఆన్సర్ అంటూ సుదీప్ సిగ్గుపడిన ప్రోమో ఇప్పుడు సాంఘీక మాధ్యమాల్లో హల్చల్ చేస్తుంది.

Nag fed up with Bigg Boss contestants!:

Kiccha Sudeep to host Bigg boss as a Guest
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs