Advertisement
Google Ads BL

ఆదిపురుష్ లక్షణ్.. సీతలు ఫిక్స్ అంటున్నారు!


ప్రభాస్ మోడ్రెన్ రాముడిగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ సినిమా ముచ్చట్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ప్రభాస్ ముంబైలో లుక్ టెస్ట్ తో పాటుగా ఆదిపురుష్ కథా చర్చల్లో పాల్గొనడమే కాదు.. ముంబై లో ఆదిపురుష్ కోసం బాగా ప్రిపేర్ అవుతున్నాడు. ఇప్పటికే ప్రభాస్ ఆదిపురుష్ కోసం వెయిట్ తగ్గి స్లిమ్ లుక్ లో అదరగొట్టేస్తున్నాడు. ఆదిపురుష్ లో రాముని పాత్ర కోసం ప్రభాస్ చాలా కష్టపడుతున్నాడు. అయితే ఆదిపురుష్ లో విలన్ పాత్రకి సైఫ్ అలీ ఖాన్ ని ఎంపిక చేసిన ఓం రౌత్ .. హీరోయిన్ విషయం ఇంకా రివీల్ చెయ్యడం లేదు. కియారా అద్వానీ, కీర్తి సురేష్, కృతి సనన్ ల పేర్లు వినిపించినా.. తాజాగా ఆదిపురుష్ సీత పాత్రకి కృతి సనన్ హీరోయిన్ గా ఫిక్స్ చేశారనే న్యూస్ బాలీవుడ్ సర్కిల్స్ లో వినబడుతుంది. ప్రభాస్ పక్కన సీత కేరెక్టర్ కి బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ ఎంపిక పూర్తయ్యింది అని.. త్వరలోనే విషయమై ప్రకటన కూడా వస్తుంది అని అంటున్నారు.

Advertisement
CJ Advs

అయితే తాజాగా ఆదిపురుష్ లక్షణుని పాత్ర ఎంపిక కూడా పూర్తయ్యింది అని.. ప్రభాస్ కి తమ్ముడిగా లక్షణుడి పాత్రలో సోను కె ట్వీటూ కి స్వీటీ లో అదరగొట్టిన సన్నీ సింగ్ ఆదిపురుష్ లో లక్షణ్ కేరెక్టర్ చేయబోతున్నాడనే న్యూస్ ప్రచారంలోకొచ్చింది. ఇప్పటికే ఆదిపురుష్ టీం సన్నీ సింగ్ ని సంప్రదించినట్టుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు మొదలయ్యాయి. ఆదిపురుష్ లో సన్నీ సింగ్ అనగానే ఇప్పుడు సన్నీ సింగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు కూడా. మరి ఆదిపురుష్ సీత గా కృతి సనన్, లక్షణుడిగా సన్నీ సింగ్ లు ఫిక్స్ అయ్యారని.. ఈ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది అనే టాక్ వినిపిస్తుంది. ఇక ఆదిపురుష్ జనవరి 18 నుండి సెట్స్ మీదకెళ్లబోతుందని సమాచారం.

Kriti sanon to play Sita role in Prabhas Adipurush:

Sunny Singh  to play Lakshman to Adipurush Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs