Advertisement
Google Ads BL

నాగార్జున కొంప ముంచుతున్న అభిజిత్ ఫాన్స్!


శనివారం వచ్చింది అంటే బిగ్ బాస్ ప్రేక్షకులక సరదాగానే, ఇంట్రెస్టిగ్ గానే ఉంటుంది. కానీ హౌస్ మేట్స్  కి నాగార్జున వస్తున్నాడని, చూద్దాం అనే ఆనందం కన్నా.. వాళ్లలో టెంక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారం వారం తమ తప్పులని ఎత్తి చూపించి నాగ్ క్లాస్ పీకుతాడనే భయం. ఈ శనివారం ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ అనుకున్నదే జరిగింది. నాగ్ రావడం రావడమే సీరియస్ గా బెస్ట్ కెప్టెన్ హారికాని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి.. నువ్వు బెస్ట్ అనుకుంటున్నావా.. కాదు నువ్వు చేసిన తప్పులు చూడు అంటూ వీడియోస్ ప్లే చేసి చూపించి నువ్వు నువ్వుగా ఆడకుండా అభిజిత్ కోసం ఆడుతున్నావ్ అంటూ హరికకి క్లాస్ పీకాడు. అభిజిత్ అభిజిత్ అంటూ తన కోసం కాదు.. నీ గేమ్ నువ్వు ఆడు అంటూ హరికకి ఫుల్ క్లాస్ ఇచ్చాడు.

Advertisement
CJ Advs

అవినాష్, అఖిల్, సోహైల్ తప్పులని లైట్ గా ఎత్తి చూపించి.. అరియనా నువ్వు వరెస్ట్ కెప్టెన్ కాదు.. నువ్వు బెస్ట్ కెప్టెన్ అని చెప్పిన నాగ్ సడన్ గా  డోర్స్ ఓపెన్ అంటూ అభిజిత్ తప్పులని ఎత్తి చూపించాడు. నువ్వు వరెస్ట్ పెరఫార్మెర్ అని బిగ్ బాస్ అన్నాడు. అలాగే మోనాల్ తో డేట్ ఎందుకు చెయ్యలేదు.. మోనాల్ ని నువ్వు ఏడిపించడం కరెక్ట్  కదా అంటూ అభికి వీడియో వేసి చూపించి తప్పు ఒప్పించాడు. అభిజిత్ కూడా రియలైజ్ అయ్యి నాగార్జునకి చాలాసార్లు సారి చెప్పాడు. అయితే ఈ రోజు మధ్యాన్నమే అభిజిత్ కి నాగ్ క్లాస్ అనే ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

అభిజిత్ ని నాగార్జున అలా కోప్పడడం, క్లాస్ పీకడంతో అభిజిత్ ఫాన్స్ బాగా హార్ట్ అయ్యారు. అభిజిత్ ని నాగ్ నెగెటివ్ చేయడంపై అభిజిత్ ఫాన్స్ మండిపడుతున్నారు. #stoptargetingAbhijeet అంటూ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. శనివారం రాత్రి 12 గంటలకే రెండు లక్షల ట్వీట్స్ తో #stoptargetingAbhijeet హాష్ టాగ్ ట్రేండింగ్ లో ఉంది.. ఇండియా వైడ్ గా ట్విట్టర్ లో #stoptargetingAbhijeet అంటూ అభిజిత్ ఫాన్స్ నాగ్ ని ట్రోల్ చేస్తున్నారు. టాప్ 2 కంటెస్టెంట్, బిగ్ బాస్ విన్నర్ అయ్యే కంటెస్టెంట్, నాగ్ మెచ్చిన కంటెస్టెంట్ ని నాగార్జునే నెగెటివ్ గా చూపించడం కరెక్ట్ కాదు అంటూ అభిజిత్ ఫాన్స్ ని నాగార్జున ని సోషల్ మీడియాలో ఏసుకుంటున్నారు.

Nagarjuna wild Trolled by Abhijith fans:

Abhijit's fans trend - #StopTargetingAbhijeet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs