ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రకాష్ రాజ్ vs నాగబాబు అన్నట్టుగా ఉంది వ్యవహారం. పవన్ కళ్యాణ్ బిజెపితో పొత్తు కోవడం ఇష్టం లేని.. నటుడు, రాజకీయనాయకుడు ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ ని ఊసరవెల్లి అంటూ విమర్శించడంతో మొదలైన గొడవ.. నాగబాబు ప్రకాష్ రాజ్ కి కౌంటర్ ఇవ్వడం, నాగబాబుకు ప్రకాష్ రాజ్ కి కౌంటర్లు ఇచ్చికోవడంతో వాతావరణం అంతా హాట్ హాట్ గా మారింది. తమ్ముడు పవన్ ని అనడంతో అన్న నాగబాబు లైన్ లోకొచ్చి పవన్ కళ్యాణ్ ప్రజా క్షేమం కోసమే బిజెపి తో పొత్తు పెట్టుకున్నాడని ప్రకాష్ రాజ్ కి రాజకీయంగానే కౌంటర్ ఇవ్వకుండా,... ప్రకాష్ రాజ్ సినిమా కెరీర్ పై సంచలనం గా మాట్లాడాడు. ప్రకాష్ రాజ్ నిర్మాతలను బాధపెట్టే నటుడు అంటూ ప్రకాష్ రాజ్ పరువు తీసేసాడు.
నాగబాబు మాత్రమే కాదు.. ఇండస్ట్రీలో చాలామంది పవన్ ని ప్రకాష్ రాజ్ విమర్శించినందుకు ప్రకాష్ రాజ్ పై విరుచుకుపడుతున్నారు. అయితే తాజాగా నాగబాబు తమ్ముడి తరుపున వకాల్త పుచ్చుకుని తనని కామెంట్ చేసిన కారణంగా ప్రకాష్ రాజ్ నాగబాబు కి ఓ సింపుల్ కౌంటర్ తో ట్వీటేసాడు. 'గౌరవనీయులైన నాగబాబుగారికి, మీ తమ్ముడు మీద ఉన్న ప్రేమ నాకు అర్థం అయ్యింది. నాకు దేశం మీద ఉన్న ప్రేమని మీరు అర్థం చేసుకోండి. నాకు తెలుగు భాష వచ్చు కానీ మీ భాష రాదు..' అంటూ చాలా నీట్ గా నాగబాబుకు కౌంటర్ ఇచ్చాడు ప్రకాష్ రాజ్.