Advertisement
Google Ads BL

బిగ్ బాస్ అవినాష్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి?


ఒకప్పుడు జబర్దస్త్ అవినాష్ .. జబర్దస్త్ అవినాష్, ముక్కు అవినాష్ అనే వాళ్ళు.. ఇప్పుడేమో బిగ్ బాస్ అవినాష్ అంటున్నారు. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టినప్పటినుండి అవినాష్ బిగ్ బాస్ అవినాష్ గా మారిపోయాడు. అవినాష్ బిగ్ బాస్ కప్ గెలవడానికి శాయశక్తులా   ప్రయత్నాలు చేస్తున్నాడు. నామినేషన్స్ లోకి రాకుండా ఉండేందుకు అవినాష్ పడరాని పాట్లు పడుతున్నాడు. నామినేషన్స్ లోకి వస్తే అవినాష్ కి భయం పట్టుకుంటుంది. ఎంతగా కామెడీ చేసినా అవినాష్ ని నామినేషన్స్ భయం వెంటాడుతుంది. ఇక తాజాగా బిగ్ బాస్ అవినాష్ కి ఓ ఇమ్యూనిటీ ఇచ్చాడు. రెండు వారాల్లో ఏదో ఓ వారం దాన్ని వాడుకుని నామినేషన్స్ నుండి తప్పించుకోవచ్చట. అది డైరెక్ట్ టికెట్ గ్రాండ్ ఫినాలేకి అవినాష్ వెళ్లినా వెళ్లొచ్చు.

Advertisement
CJ Advs

అయితే ప్రస్తుతం జబర్దస్త్ ని వదిలేసి.. బిగ్ బాస్ కి వచ్చిన అవినాష్ కి జబర్దస్త్ ఎంట్రీ లేదంటూ బిగ్ బాస్ హౌస్ లో సింపతీ క్రియేట్ చేసుకున్న అవినాష్ ఇప్పుడు బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయినా, లేదంటే విన్నర్ అయ్యాక అతని నెక్స్ట్ ప్లాన్ ఏంటి.. అవినాష్ కి బిగ్ బాస్ ద్వారా ఎంత క్రేజ్ వచ్చింది. బిగ్ బాస్ తర్వాత అవినాష్ జబర్దస్త్ కి వెళతాడా.. లేదంటే నాగబాబు ని నమ్ముకుని జీ తెలుగులో ప్రసారమయ్యే అదిరింది ప్రోగ్రాం లో కాలుపెడతాడా.. బిగ్ బాస్ క్రేజ్ తో సినిమాల్లో అవకాశాలు వచ్చి వెండితెరకు షిఫ్ట్ అవుతాడా అనే విషయంలో సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చలు మొదలయ్యాయి. అయితే అవినాష్ ని బిగ్ బాస్ టైటిల్ విన్నర్ చెయ్యాలని.. జబర్దస్త్ టీం సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు కానీ అవినాష్ అన్నట్టుగా హీరో హీరోనే.. విలన్ విలనే.. దర్శకుడు దర్శకుడే.. కమెడియన్ కామెడీనే. విన్నర్ అయ్యే ఛాన్సెస్ మాత్రం తక్కువనే చెప్పాలి.

What is Bigg Boss Avinash's next plan?:

What is his plan after getting eliminated or after winning?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs