Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 4: బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరెస్ట్ కెప్టెన్ ఎవరు?


బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్స్ కి దగ్గరపడుతోంది. ఈ వారం ఓ కంటెస్టెంట్ వైల్డ్ కార్డు ఎంట్రీ అంటూ ప్రచారం జరగడం అందులో నోయెల్, స్వాతి దీక్షిత్, కుమార్ సాయి.. కొత్తగా మంగ్లీ పేర్లు వినబడింది ఇక ఈ సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీస్ లేవని, అలాగే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న అఖిల్, అరియనా, మోనాల్ లో ఎవరూ ఎలిమినేట్ కూడా అవ్వరని, అంటే ఈ వారం బిగ్ బాస్ నుండి ఎవరూ ఎలిమినేట్ కారని, ఈ వీక్ ఎలిమినేషన్స్ ని స్కిప్ చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇక గత రెండు రోజులుగా హౌస్ లో దెయ్యాల గోలకి చెవులు చిల్లులు పడుతున్నాయి. మరోపక్క బిగ్ బాస్ హౌస్ లో దెయ్యాల చేష్టలతో హౌస్ మేట్స్ అంతా వణికిపోతున్నారు. సోహైల్, అఖిల్ కి జలజ దెయ్యం చుక్కలు చూపించినా.. బిల్డప్ రాజాల్లా మేము భయపడలేదు అంటూ మోనాల్ కి కథలు చెబుతున్నారు అఖిల్ అండ్ సోహైల్ లు.

Advertisement
CJ Advs

ఇక ఈ హౌస్ లో రేస్ టు ఫినాలే మొదలైంది.. ఇక్కడున్న మాజీ కెప్టెన్సీ లి నుండి ఒకరు వరెస్ట్ కెప్టెన్, ఒకరు బెస్ట్ కెప్టెన్ ని ఎన్నుకోవాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ ఆఫర్ ఇవ్వడంతో నేను బెస్ట్ కెప్టెన్ అంటే నేను బెస్ట్ అనుకుంటూ అరియనా, సోహైల్ లు గొడవ మొదలు పెట్టారు. అరియనా కెప్టెన్సీలో మేము ఇబ్బంది పడ్డాం అని సోహైల్ అంటే..  నేను బెస్ట్ ఇచ్చా అని అరియనా.. నేను పనిషమెంట్స్ పెట్టిన కెప్టెన్ అంటూ సోహైల్... కాదు నేను బెస్ట్ కెప్టెన్ అని అఖిల్ అనగానే అభిజిత్ మళ్ళీ అఖిల్ నువ్వు ఎందుకు రెడ్ జోన్ కి వెళ్ళావ్ డిఫెండ్ ఎందుకు చేసుకోలేదు.. అంటూ అఖిల్ - అభిజిత్ ల గొడవ స్టార్ట్ అయ్యింది. ఇక చివరి వారంలోకి వస్తున్నా అఖిల్ - అభిజిత్ ఆ గొడవ మాత్రం ఆగడం లేదు. కలిసినట్టే కసిపోతున్న అఖిల్ - అభిజిత్ లు ఎప్పుడుబడితే అప్పుడు గొడవ పడుతూనే ఉన్నారు. ఈ వారం బెస్ట్, వరెస్ట్ కెప్టెన్సీ విషయంలో అఖిల్ - అభిజిత్ ల గొడవ మళ్ళీ ఓ మినీ యుద్దాన్ని తలపించేదిలా ఉంది.

Bigg boss4 : Who is the Best Captain? Who is the Worst Captain:

Bigg boss to Spice up things between contestants    
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs