Advertisement
Google Ads BL

చరణ్ కి పర్మిషన్ ఇచ్చిన రాజమౌళి!!


కరోనా కారణంగా వాయిదా పడి.. మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టుకున్న RRR షూటింగ్ చిత్రీకరణ లో రామ్ చరణ్ బ్రేక్ లేకుండా పాల్గొంటున్నాడు. RRR షూటింగ్ కొలిక్కి రాగానే రామ్ చరణ్ తండ్రి ఆచార్య సినిమా కోసం ప్రిపేర్ అవ్వాల్సి ఉంది. ఎందుకంటే ఆచార్య లో రామ్ చరణ్ కోసం అదిరిపోయే రోల్ ని సిద్ధం చేసి ఉంచాడు దర్శకుడు కొరటాల. ఆచార్య సినిమా షూటింగ్ కూడా మొదలు కావడం, తాజాగా ఆచార్య షూటింగ్ లో చిరు పాల్గొనడం జరుగుతుంది. అయితే RRR తో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఆచార్య కోసం రాక ఆలస్యమవుతుంది అని.. దాని కోసం ఆచార్య షూటింగ్ వాయిదా పడినా పడొచ్చనే ప్రచారం జరిగింది.

Advertisement
CJ Advs

కానీ తాజాగా ఆచార్య లోకి రామ్ చరణ్ రాకకి డేట్ ఫిక్స్ అయ్యింది అని .. రాజమౌళి రామ్ చరణ్ కి ఆచార్య షూటింగ్ లో పాల్గొనేందుకు పర్మిషన్ ఇచ్చేసాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తుంది. రామ్ చరణ్ సంక్రాతి వరకు RRR షూటింగ్ లో పాల్గొంటాడని, పండగ తర్వాత ఓ 20 రోజుల పాటు ఆచార్య కోసం రామ్ చరణ్ డేట్స్ కేటాయిస్తున్నాడని అంటున్నారు. ఆ 20 రోజుల్లోనే రామ్ చరణ్ సన్నివేశాల చిత్రీకరణ ని పూర్తి చేస్తాడట కొరటాల. మరి RRR తో బిజీగా ఉన్న రామ్ చరణ్ కి డేట్స్ కుదరకపోతే ఎలా అనే కంగారులో కొరటాల ఉన్నప్పటికీ.. రాజమౌళి అన్ని అలోచించి రామ్ చరణ్ ఆచార్య షూటింగ్ కోసం చరణ్ పర్మిషన్ ఇచ్చాడట.

Rajamouli gives permission to Charan! :

After Sankranti charan gets Acharya's Dates
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs