Advertisement
Google Ads BL

కరోనాతో గ్యాప్ వచ్చింది.. పాత్ర మర్చిపోయా..!


కరోనా కారణంగా తారలంతా ఇంటికి పరిమితమై, నటనకు దూరంగా ఉన్నారు. నటించే అవసరం లేదు.. సో మొహానికి మేకప్ పని లేదు. పేరెంట్స్ తో జాలిగా గడుపుతూ రకరకాల వర్కౌట్స్ ట్రై చేస్తూ బాడీ షేప్ ని కాపాడుకున్న హీరోయిన్స్ అంతా ఇప్పుడు మళ్ళీ షూటింగ్స్ తో బిజీ అయ్యారు. అటూ ఇటూ తిరుగుతూ ఎయిర్ పోర్ట్స్ కెమెరాలకు దొరికిపోతున్నారు. ఇక సౌత్ ని ఓ ఊపు ఊపి బాలీవుడ్ కి చెక్కసిన ఇలియానా అయితే కరోనా కారణంగా ఇంట్లోనే ఉండిపోయింది. తాజాగా బల్విందర్ సింగ్ తెరకెక్కిస్తున్న అన్ ఫెయిర్ అండ్ లవ్లీ  సినిమా షూటింగ్ కోసం సెట్స్ లో అడుగుపెట్టింది గోవా సుందరి. కరోనా వలన షూటింగ్ స్పాట్ లో ముందు భయపడినా.. తర్వాత మెల్లగా అలవాటైపోయింది అని చెబుతుంది ఇలియానా.

Advertisement
CJ Advs

షూటింగ్ స్పాట్ లో కరోనా టెస్ట్ లు చేయించుకుని.. కోవిడ్ నిబంధనల ప్రకారం షూటింగ్ చేసుకున్నామని, కరోనా తో ముందు భయపడినా తర్వాత అలవాటైపోయింది అని, కాకపోతే కరోనా వలన ఇంట్లోనే గడిపిన చాలా రోజులకి స్పాట్ లో అడుగుపెట్టినప్పుడు నా పాత్ర నటన గురించి మర్చిపోయాయనేమో అని భయపడ్డా అంటుంది. అందుకే ముందుగా రిహార్సల్స్ చేసుకుంటే బావుండేదని నేను దర్శకుడు అనుకున్నామని, కానీ షూటింగ్ స్పాట్ లోకి వెళ్ళాక కెమెరా ముందు నిలబడగానే పాత్రలోకి సహజంగానే లీనమైపోయా అంటుంది ఇలియానా. నిజం చెప్పాలంటే కరోనా తో బ్రేక్ వచ్చిన కారణంగా ఇంకా బాగా నటించగలిగాను అంటుంది ఇల్లి బేబీ.

Ileana interesting comment on Corona:

Ileana forgot her role with Corona
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs