Advertisement
Google Ads BL

తొమ్మిదిమంది విలన్స్ తో పుష్ప రాజ్ ఫైట్?


సుకుమార్ పుష్ప సినిమలో అల్లు అర్జున్ తో ఫైట్ చేసేందుకు స్టైలిష్ విలన్ కోసం నానా తంటాలు పడుతున్నాడు. పుష్ప పాన్ ఇండియా మూవీ కావడంతో ఆ రేంజ్ విలన్ కోసం సుకుమార్ వేట మొదలు పెట్టాడు. కానీ ఇంకా పుష్ప కి విలన్ దొరకలేదు. అల్లు అర్జున్ తో పుష్ప సినిమాలో తలపడబోయే విలన్ ఇతనే అంటూ రకరకాల పేర్లు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. ఆర్య, బాబీ సింహ, మాధవన్ పేర్లతో పాటుగా జాతీయ అవార్డు గ్రహీత హీరో విక్రమ్ పేరు కొత్తగా పుష్ప విలన్స్ లిస్ట్ లోకొచ్చింది. ఒక్క విజయ్ సేతుపతి తప్పుకోవడంతో సుకుమార్ ఇప్పడు ఇరకాటంలో పడ్డాడు.

Advertisement
CJ Advs

మరి ఒక్క విలన్ కోసం సుకుమార్ పడుతున్న తంటాలు చూస్తుంటే అమ్మో అనిపిస్తుంటే.. ఇప్పుడు లేటెస్ట్ గా పుష్ప రాజ్ అదే అల్లు అర్జున్ పుష్ప సినిమాలో తొమ్మిదిమంది విలన్స్ తో ఫైట్ చెయ్యబోతున్నాడే టాక్.. అల్లు అర్జున్ అభిమానులని ఊపేస్తోంది. పుష్ప సినిమాలో చిన్న, పెద్ద విలన్స్ తొమ్మిది ఉండబోతున్నారట. అందులో కమెడియన్ సునీల్ కూడా ఉన్నాడట. సునీల్ ది డిఫ్రెంట్ విలన్ రోల్ అంటున్నారు. ఇంకా రావు రమేష్ మరికొంతమంది విలన్స్ అల్లు అర్జున్ కి చుక్కలు చూపిస్తారంట. ఎనిమిదిమంది చిన్న చిన్న తో పాటుగా.. మెయిన్ విలన్ ఒక్కరుంటారని.. ఆ విలన్ తోనే అల్లు అర్జున్ అడుగడుగునా కష్టాలు పడుతుంటాడని.. వారి మధ్యన జరిగే యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలెట్ అంటున్నారు. అయితే ఆ మెయిన్ లీడ్ విలన్ ఎవరనేది ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

Nine Villains for Pushpa Movie?:

Comedy artist turned hero Sunil will be playing the main villain of Pushpa
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs