Advertisement
Google Ads BL

ఇది టెలికాస్ట్ చెయ్యొద్దంటున్న అఖిల్ - సోహైల్!


ఈ మూడు వారలను బిగ్ బాస్ ఏదైనా కొత్త టాస్క్ లతో ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేస్తాడనుకున్న ప్రేక్షకులకు మళ్లీ మళ్ళీ నిరాశే. సీజన్ మొదలు పెట్టినప్పటినుండి బిగ్ బాస్ డల్ గా సాగుతున్నట్టుగానే ఈ మూడు వారలు కూడా అలానే ఉండేటట్టు ఉంది. బుధవారం ఎపిసోడ్ లో లగ్జరీ బడ్జెట్ కోసం దెయ్యాల టాస్క్ ని పెట్టారు. ఇక కంటెస్టెంట్స్ లో దెయ్యం భయం కన్నా దెయ్యంతో ఆడుకోవడం ఎక్కువైంది. అరియనా అయితే దెయ్యానికి భయపడినట్లుగా ఓవరేక్షన్. ఇక అవినాష్ దెయ్యంతో కామెడీ చేస్తున్నాడు. సోహైల్ పోల్ డాన్స్, అభిజిత్ - అఖిల్ మోనాల్ ని ఏడిపించినందుకు గాను ఆమెని డేట్ కి తీసుకెళ్లాలి.

Advertisement
CJ Advs

దానికి అభిజిత్  ఒప్పుకోకుండా కన్నీళ్లు పెట్టుకోవడంతో అభిజిత్ ని వదిలి అఖిల్ - మోనాల్ డేట్ కి వెళ్లారు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో దెయ్యాల అరాచకం ఎక్కువ ఉన్నట్టుగా చూపిస్తున్నాడు బిగ్ బాస్. అరియనా , అవినాష్ దెయ్యలతో కామెడీ చేస్తుంటే.. మోనాల్ ధైర్యంగా దెయ్యాల దగ్గరకు వెళుతుంది. ఇక సోహైల్ అయితే దెయ్యాలంటే భయం లేదంటూనే అఖిల్ తో కలిసి దెయ్యాల రూమ్ కి వెళ్లి.. నువ్వు ఎఫెక్ట్స్ వెయ్యి అంటూ రెండు తొడలు కొట్టిన సోహైల్ ని అఖిల్ ని లైట్స్ వేస్తూ ఆర్పుతూ వాళ్ళిద్దరిని భయపెట్టాయి దెయ్యాలు. దానితో మోనాల్ కామెడిగా కథ వేరుగా ఉంటుంది అంటూ డాన్స్ చేస్తూ సోహైల్ ని ఏడిపిస్తుంది. 

సోహైల్ - అఖిల్ నిజంగా భయపడినట్లుగా నటిస్తూ ఈ వీడియో ఫుటేజ్ వెయ్యొద్దు బిగ్ బాస్ మా ఇజ్జత్ పోతుంది అంటూ బిగ్ బాస్ కెమెరా ముందు వేడుకుంటున్నారు. కానీ బిగ్ బాస్ ఎందుకు ఊరుకుంటాడు.. సోహైల్ - అఖిల్ భయపడుతున్న వీడియో ని ప్రొమో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ చేసి వదిలాడు.

Akhil - Sohail begging Bigg Boss to not telecast this:

Bigg Boss 4: Akhil and Sohail were scared as hell!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs