దక్షిణాదిన హీరోయిన్ గా పరిచయమైన తాప్సి.. ప్రస్తుతం బాలీవుడ్ ని దున్నేస్తుంది. దక్షిణాది సినిమాల్లో తాప్సి హీరోయిన్ గా రాణించలేకపోయింది. కానీ బాలీవుడ్ లో మాత్రం తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకోవడమే కాదు.. తనని ఎవరైనా ఏదైనా అన్నా, అనవసరంగా మాట్లాడుతూ ఇబ్బంది పెట్టినా వాళ్ళకి దిమ్మతిరిగే సమాధానం ఇస్తుంది తాప్సి. కంగనా రనౌత్ కి భయపడి బాలీవుడ్ అంతా నోరు మూసుకుంటే తాప్సి కంగానికి తన స్టయిల్లో సమాధానం చేబుతుంది. తాజాగా ఓ నెటిజెన్ తాప్సి పై చేసిన చీప్ కామెంట్స్ కి తాప్సి కి తిక్కరేగింది. ఆ నెటిజెన్ కి వాచిపోయే సంధానం ఇచ్చింది.
తాప్సి నటనపై ఓ నెటిజెన్ తీవ్రమైన విమర్శలు గుప్పించాడు. ఆమెకి అసలు నటన రాదని, నువ్వు ఫాల్తూ హీరోయిన్ వి.. నువ్వు ఎత్తుకుని(ఎంచుకుని) సినిమాలు చేస్తావు అంటూ ఓ నెటిజెన్ తాప్సి ని ఘాటైన వ్యాఖ్యలతో చీప్ కామెంట్స్ చేసాడు. దానిని చూసిన తాప్సి ఆ నెటిజెన్ కి ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఏం ఎత్తుకుని సినిమాలు చేస్తాను. నా ఇమేజ్ ను పైకి ఎత్తుతున్నా. నా క్రేజ్ తోనే నేను సినిమాలు చేసుకుంటున్నాను.. నీకు మాత్రం ఈ విషయం అర్థం కావడం లేదు. అంటూ నెటిజెన్ నోరు మూయించింది తాప్సి.