ప్రస్తుతం తెలంగాణాలో జిహెచ్ఎంసీ ఎన్నికల వేడి మాములుగా లేదు. అధికార టీఆరెస్ పార్టీ, బీజేపీ పోటాపోటీగా ఎన్నికల ప్రచారం ఉన్నాయి. కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ప్రచారం అంతంతమాత్రంగా కనబడుతున్నావేళ ఎంఐఎం నాయకులు చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఎన్టీఆర్, పివి సమాధులను కూలుస్తాము అంటూ ఎంఐఎం నాయకులు చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎంఐఎం చేసిన సమాధుల కాల్చివేత వ్యాఖ్యలు గ్రేటర్ ఎన్నికల్లో మంటలు రాజేస్తున్నాయి. ఎంఐఎం వ్యాఖ్యలకు బీజేపీ ఘాటుగానే స్పందిస్తుంది. ఎన్టీఆర్, పివి సమాధులను కూలుస్తామని ముస్లిం నాయకులు ఆ విధంగా మాట్లాడుతుంటే.. అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్ స్పందించకపోవడం విచారకరం అంటూ పివి సమాధి దగ్గర బిజెపి నాయకులు బండి సంజయ్ నివాళు అర్పించారు.
ఇక పార్టీ విషయమైనా, తండ్రి విషయమైనా తొడ కొట్టి రెచ్చిపోయే బాలకృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ సమాధులు కూలుస్తాం అంటూ ఎంఐఎం నాయకులు చేసిన వ్యాఖ్యలకు బదులివ్వకపోవడం టిడిపి శ్రేణులను విస్మయానికి గురి చేస్తుంది. అయితే అందుకు కారణం ముస్లిం ఓటు బ్యాంకు పోతుంది అనా.. లేదంటే పార్టీ నుండి ఆదేశాలు లేవని బాలయ్య స్పందించలేదా.. అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ తెలంగాణాలో నామ మాత్రంగా ఉన్న టిడిపి ఎంఐఎం నాయకులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆందోళన చేపట్టారు. తండ్రి ఎన్టీఆర్ మీద ఎవరేం మాట్లాడినా విరుచుకుపడే బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ సమాధి కూలుస్తామని అంటుంటే.. బాలయ్య మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడం బాలయ్య అభిమానులకు, టిడిపి శ్రేణులకు నచ్చడం లేదు. అయితే బాలయ్య ఈ వ్యాఖ్యలకు స్పందించకపోవడంపై బిజెపి నాయకుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.