Advertisement
Google Ads BL

నాని అంటే.. సుందరానికి స్టోరీ లీక్?


నాని సినిమాలకు మీడియం రేంజ్ నిర్మాతలు పొలోమంటూ బడ్జెట్ పెట్టడానికి రెడీ అవ్వడం అనేది నాని మీద ఉన్న నమ్మకమే కారణం. కానీ ఇప్పుడు నాని వెంట పెద్ద నిర్మాణ సంస్థలు పడుతున్నాయి. నాని తో సినిమా అంటే సేఫ్.. అలాగే నాని సినిమా ఒప్పుకున్నాడంటే అందులో విషయం ఉటుందని ఆడియన్స్ నమ్మకం. గ్యాంగ్ లీడర్ ప్లాప్ తో ఉన్న నాని టక్ జగదీశ్ సినిమాతో పాటుగా శ్యాం సింగరాయ.. కొత్తగా మైత్రి మూవీస్ లో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి సినిమాలు మొదలు పెట్టాడు. వరస సినిమాలతో బిజీగా ఉన్న నాని అంటే.. సుందరానికి సినిమాపై అందరిలో అమితాసక్తి నెలకొంది. ఎందుకంటే సినిమా మీద నాని అండ్ నిర్మాతలు పెంచిన అటెంక్షన్ అలాంటిది.

Advertisement
CJ Advs

ఫస్ట్ లుక్ తోనే ఇంట్రెస్ట్ పెంచిన దర్శకుడు వివేక్ ఆత్రేయ.. ఈ సినిమాని కామెడీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కించబోతున్నాడని..  అంటే సుందరానికి సినిమా స్టోరీ ఇదే ఓ కథ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది నాని ఈ సినిమాలో బ్రాహ్మణ యువకుడిగా కామెడీ చేస్తాడని అంటున్నారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నాని వాళ్ళ కుటుంబంలో బ్రాహ్మణ సంప్రదాయాలు, మడి ఆచారాలు ఫాలో అవుతుందట. కానీ సుందరం(నాని) మాత్రం ఓ క్రీస్టియ‌న్ అమ్మాయిని ప్రేమించడం.. ఆ అమ్మాయి కూడా బ్రాహ్మణ అమ్మాయే అని కుటుంబంతో అని అబద్దమాడుతాడట. క్రిస్టియన్ అయిన హీరోయిన్‌ నజ్రియాని బ్రాహ్మణురాలిగా మార్చడం... ఏమి తెలియని అమ్మాయి బ్రాహ్మణ పద్దతులు, భాష, యాస ఆచారాలు నేర్పేందుకు సుందరం నానా కష్టాలు పడడం అనే విషయాన్నీ వివేక్ ఆత్రేయ కామెడీగా చూపించబోతున్నాడట.

Nani Ante Sundaraniki Story leaked?:

Nani - Vivek Athreya Movie Ante Sundaraniki Story leaked?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs