Advertisement
Google Ads BL

అఖిల్ ని వదిలి.. అభిజిత్ తో మోనాల్!!


బిగ్ బాస్ లో లవ్ స్టోరీస్ నడిపితే ఫుటేజ్ వస్తుంది అని గత రెండు సీజన్స్ నుండి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి బుల్లితెర ప్రేక్షకులకు తేటతెల్లమైంది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పక్కా ప్లానింగ్ తో లవ్ ట్రాక్స్ నడుపుతున్నారు. గత సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ - పునర్నవి లవ్ స్టోరీని హైలెట్ చేసిన బిగ్ బాస్ ఈసారి అఖిల్ - మోనాల్ గజ్జర్ లవ్ స్టోరీని హైలెట్ చేసాడు. అదే ప్రేక్షకులకు నచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ మొదట్లో ట్రయాంగిల్ స్టోరీ నడిపిడీనుండి. అఖిల్ - అభిజిత్ లతో దోబూచులాడింది. అయితే మోనాల్ విషయంలో అభిజిత్ తెలివిగా అలోచించి.. మూడు వారాలు తరువాత ఆమెని దూరం పెట్టాడు. అభిజిత్ కి దూరమైన మోనాల్ అఖిల్ కి దగ్గరైంది. అఖిల్ - మోనాల్ ల వ్యవహారం 11 వారాల వరకు బాగానే సాగింది. 

Advertisement
CJ Advs

కానీ గత రెండు వారాలుగా మోనాల్ - అఖిల మధ్యన వార్ మొదలైంది. అప్పటినుండి అభిజిత్ తో మోనాల్ ఎక్కువగా కనబడుతుంది. తాజా నామినేషన్స్ లో అఖిల్ తో స్వాప్ చేసుకోకుండా షాకిచ్చిన మోనాల్.. ఆఖరుకు కెప్టెన్ హారిక చేతిలో బలయ్యింది. హారిక పవర్ ఉపయోగించి అభిజీత్ తో మోనాల్ స్వాప్ చేసుకోమంటే.. అభిజిత్ నామినేషన్ నుండి సేవ్ అయ్యి మోనాల్ నామినేషన్స్ లోకి వెళ్ళింది. దానితో అభిజిత్ కి మోనాల్ మీద సాఫ్ట్ కార్నర్ స్టార్ట్ అయ్యింది. అఖిల్ - మోనాల్ బ్రేకప్ అన్నట్టుగా ఉంటే.. అభి - మోనాల్ స్టోరీ స్టార్ట్ అన్నట్టుగా బిగ్ బాస్ ప్రోమోస్ వస్తున్నాయి.

తాజా ప్రోమోలో.. అభిజిత్ నేను ఎవ్వరిని బలి చేసి ముందుకు వెళ్ళను అంటాడు. కానీ మోనాల్ విషయంలో చెప్పగానే నామినేషన్ నుండి దిగిపోయాడు. కనీసం నేను నామినేషన్స్ లోనే ఉంటాను అని అనలేదు అంటూ అఖిల్. సోహైల్ తో మాట్లాడుతుంటే.. అక్కడ మోనాల్ తో కూర్చున్న అభిజిత్ అంతా ఏదోలా ఉంది, నువ్వు మా నాన్నకి నచ్చడం ఏమిటి అంటూ షాకవడం చూస్తుంటే.. అభి - మోనాల్ స్నేహం మొదలైనట్టుగా ఉంది. అంటే మోనాల్ ఇప్పుడు అఖిల్ ని వదిలి అభిజిత్ తో లవ్ ట్రాక్ మొదలుపెడుతుందేమో.. !

Leave Akhil .. Monal with Abhijit !!:

Bigg boss 4: Monal and Abhijeet Again in good terms?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs