ఆహా ఓటిటి ని ప్రమోట్ చెయ్యడం కోసం అల్లు అరవింద్, నందిని రెడ్డి డైరెక్షన్ లో సమంత వ్యాఖ్యాతగా సామ్ జామ్ టాక్ షో మొదలు పెట్టారు. సమంత క్రేజ్ ఏ షో కి హెల్ప్ అవడం పక్కా. కానీ షో డిజైనింగ్ పై సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ పడుతున్నాయి. సామ్ జామ్ ఫస్ట్ ఎపిసోడ్ కి రౌడీ హీరో విజయ్ దేవరకొండ వచ్చాడు. విజయ్ క్రేజ్ ఇప్పుడు టాలీవుడ్ నుండి బాలీవుడ్ దాక ఉండడం.. విజయ్ ని సమంత ఇంటర్వ్యూ చేస్తూ గేమ్ ఆడించడం అనేది కాస్త కొత్తగా అనిపించినప్పటికీ... విజయ్ దేవరకొండ తో సమంత సామ్ జామ్ ఎపిసోడ్ కామెడి అయ్యింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడినాయి. తర్వాత చిరు సామ్ జామ్ ఎపిసోడ్ కి హాజరైనట్టుగా సోషల్ మీడియాలో పిక్స్ వైరల్ అయ్యాయి.
కానీ రానా - నాగ్ అశ్విన్ కలిసి సామ్ జామ్ సెకండ్ ఎపిసోడ్ పూర్తయ్యింది. అయితే ఈ షో లో రానా తన వ్యక్తిగత విషయాలను సమంత సామ్ జామ్ షోలో పంచుకున్నాడు. రానా తన ఆరోగ్యపై చాలా రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి
సామ్ జామ్ షో తో చెక్ పెట్టాడు. రానా పుట్టినప్పటినుండి బిపి ఉందట. దాని వలన రానాకీ హార్ట్ ప్రాబ్లమ్ కూడా వస్తుంది అని.. ఆ సమస్యల వలన కిడ్నీస్ పాడవుతాయని డాక్టర్స్ చెప్పినట్టుగా రానా ఈ షోలో చెప్పాడు. అంతేకాకుండా మెదడులో నరాలు చిట్లిపోయి స్ట్రోక్ అవడానికి 70 శాతం అవకాశం ఉందని.. చనిపోవడానికి 30 శాతం అవకాశం ఉందని డాక్టర్స్ చెప్పినట్టుగా రానా కన్నీరు పెట్టుకున్నాడు.
రానా అలా బాధపడుతూ చెప్పడంతో.. చెప్పడంతో సామ్ జామ్ సెట్స్ అంతా ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యింది. మరి విజయ్ దేవరకొండ తో సామ్ జామ్ ఫస్ట్ ఎపిసోడ్ కామెడీ కామెడీ అవగా.. సెకండ్ ఎపిసోడ్ మాత్రం రానా ఆరోగ్య సమస్యలతో సమంత ఫీలవుతూ ఎమోషనల్ గానే సాగింది. ఇక రాబోయే మెగాస్టార్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో చూడాలి.