బిగ్ బాస్ 4 లో మోనాల్ ని బిగ్ బాస్ ఎందుకు కాపాడుకుంటున్నాడో అందరికి ఓ క్లారిటీ ఉంది. మరో కంటెస్టెంట్ అఖిల్ తో లవ్ ట్రాక్ నడుపుతూ బిగ్ బాస్ కి కావల్సిన ఫుటేజ్ ఇవ్వడం, వీకెండ్స్ లో మోనాల్ అందాల ఆరబోత కోసం బిగ్ బాస్ ఆమెని హౌస్ లో ఉంచుతున్నాడు. అయితే అట మొదలైనప్పటినుండి మోనాల్ కోసం అఖిల్, అఖిల్ కోసం మోనాల్ స్టాండ్ తీసుకుంటూ సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. కానీ గత వారం కెప్టెన్సీ టాస్క్ విషయంలో అఖిల్ మోనాల్ ఫై కోపం తెచ్చుకోవడం, మమ్మి చెప్పిందని మోనాల్ తో దూరంగా ఉండడం చేస్తున్నాడు. ఆ విషయంలో మోనాల్ గట్టిగానె హార్ట్ అయ్యింది.
ఇక తాజాగా మోనాల్ అఖిల్ కి మరిచిపోలేని షాకిచ్చింది. ఈ వారం నామినేషన్స్ విషయంలో హౌస్ మేట్స్ తెలీకుండా పెట్టుకున్న ఎర్ర టోపీతో ఎలిమినేషన్స్ లోకి వెళ్లగా.. అందులో అఖిల్, అభిజిత్, అరియనా, అవినాష్ లు ఉన్నారు. అయితే బిగ్ బాస్ ఆ నలుగురిని మీరు హౌసులో ఎందుకు ఉండాలనుకుంటున్నారో చెప్పి మీరు వేరే వాళ్ళుతో స్వాప్ చేసుకోవచ్చని అనగానే అవినాష్ మోనాల్ ని రిక్వెస్ట్ చెయ్యగా.. మోనాల్ అవినాష్ కి మీరు హౌస్ లో ఉంది గట్టిగా ఆడండి అంటూ గట్టిగానే చెప్పింది. ఇక అఖిల్ కూడా మోనాల్ ని రిక్వెస్ట్ చేసి..అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నావ్ అంటున్నారు.. కానీ ఎక్కడ? అని మోనాల్ ని తనతో స్వాప్ చేసుకోమని అడిగాడు.
మోనాల్.. నేను అన్ని మైండ్ లో పెట్టుకోను.. ఇది చేశాను, అది చేశాను అని అనగానే.. అఖిల్ మాట్లాడబోగా.... అఖిల్ నువ్వు కోసం చాల మంచి చేసావ్ అని దణ్ణం పెట్టగా.. అఖిల్ ఈ వెటకారాలొద్దు అనగానే.. మోనాల్ కూడా థాంక్యూ చెప్పింది. దానితో అఖిల్ నాకో మంచి క్లారిటీ ఇచ్చావ్ మోనాల్ అన్నాడు.ఇక మోనాల్ అక్కడే నామినేషన్స్ లో ఉన్న అభిజిత్ తో స్వాప్ చేసి కి అఖిల్ షాకిచ్చింది. దానితో అఖిల్ ఫేస్ మాడిపోయింది. మోనాల్ షాక్ కి అఖిల్ కి దిమ్మ తిరిగి.. బొమ్మ కనబడింది.