Advertisement
Google Ads BL

ఎన్టీఆర్‌కి, నాకు ఎనర్జీ లెవెల్స్‌ ఎక్కువంటోంది..!


ఎన్టీఆర్ చాలా ఆక్టివ్ గా ఉంటాడు. అతనికి ఎనర్జీ లెవెల్స్ టాప్ లో ఉంటాయని.. ఓ ఇంటర్వ్యూ లో రాజమౌళి చెప్పాడు. మరి రాజమౌళి మాత్రమే  కాదు.. ఎన్టీఆర్ తో పని చేసిన మరో హీరోయిన్ కూడా ఎన్టీఆర్ ఎనర్జీ, నా ఎనర్జీ సేమ్ టు సేమ్ అంటుంది.  టాలీవుడ్ టాప్ హీరోలందరితో జోడి కడుతున్న పూజ హెగ్డే.. ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్, ప్రభాస్ ఇలా ఎవ్వరిని వదలకుండా అవకాశాలు పెట్టేస్తూ టాప్ పొజిషన్ లో దూసుకుపోతుంది. ఈ ఏడాది అలా వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ పడడంతో పారితోషకం కూడా పెంచేసిందీ భామ. తాజాగా ప్రభాస్ రాధేశ్యాం, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాల్లో నటిస్తున్న పూజ హెగ్డే కి బాలీవుడ్ బడా ఆఫర్స్ తన్నుకొస్తున్నాయి. 

Advertisement
CJ Advs

తాజాగా పూజ హెగ్డే, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ తో కలిసి నటించిన అరవింద సమేత ముచ్చట్లు మొదలుపెట్టింది. ఈ సినిమాతోనే ఫస్ట్ టైం ఎన్టీఆర్ తో కలిసి నటించింది పూజ. ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకొవడం అద్భుతం అని, అరవింద సమేత సినిమా ఎప్పటికి తనకి ప్రత్యేకం అని, ఆ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించడం సూపర్ అంటుంది. ఎన్టీఆర్ కి నాకు ఎనేర్జి లెవల్స్ కొంచెం ఎక్కువ. దానివలన ఆన్ స్క్రీన్ లో మా జోడి కి ప్రేక్షకులు ఫుల్ మార్కులు వేశారు. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు... ఆఫ్ స్క్రీన్ లోను ఈ సినిమా చాలా అనుభవాలను మిగిల్చింది. అరవింద సమేత అప్పటినుండి నా డబ్బింగ్ నేనే చెప్పుకుంటున్నాను. అది కేవలం త్రివిక్రమ్ గారివల్లే అంటూ ఎన్టీఆర్, త్రివిక్రమ్ ని ఆకాశానికెత్తేస్తుంది పూజ హెగ్డే.

NTR and I have high energy levels!:

Pooja Hegde about Ntr in Aravinda Sametha
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs